The Family Man 3 : విడుదలకు సిద్ధమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’
- స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్’
- ఉగ్రదాడి నేపథ్యంలో తొలి సీజన్
- శ్రీలంకలోని తమిళ రెబల్స్ కుట్ర నేపథ్యంలో రెండో సీజన్
- సీక్రెట్ ఇంటెలిజెన్స్ అధికారిగా మనోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Family Man 3 : బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్‌పేయి కీలక పాత్ర పోషించారు. దీని సీక్వెల్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ 2021లో విడుదలై అనూహ్యమైన రెస్పాన్స్ అందుకుంది. పార్ట్ 1, 2 లకు కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల, మనోజ్ బాజ్‌పేయి తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా, చిత్ర బృందం అతన్ని అభినందించి సెట్‌లో జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.. అవుట్ ఫుట్ అద్భుతంగా ఉందని సమాచారం. మొత్తానికి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు వచ్చిన ఈ సిరీస్ రెండు సీజన్లు మాదిరిగానే ఈ మూడో సీజన్ కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
Read Also;మరోసారి ద్విపాత్రాభినయంలో అలరించనున్న సూర్య
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా విడుదలైంది. రాజ్, డికెతో పాటు, సుమన్ కుమార్ దీనికి కథను అందించారు. ఇందులో మధ్యతరగతి వ్యక్తి, సీక్రెట్ ఇంటెలిజెన్స్ అధికారిగా మనోజ్ .. శ్రీకాంత్ తివారీ కనిపించారు. ప్రియమణి అతని భార్యగా నటించారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో సాగే మొదటి సీజన్ 2019లో విడుదలైంది. దీనికి కొనసాగింపుగా 2021లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ విడుదలైంది. ఇందులో సమంత కీలక పాత్ర పోషించింది. శ్రీలంకలో తమిళ తిరుగుబాటుదారులు చేసిన కుట్ర నేపథ్యంలో దీనిని రూపొందించారు. ఇది ప్రేక్షకులను కూడా అలరించింది. మనోజ్ బాజ్‌పేయి తను సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లో ఏం రాసుకొచ్చారంటే.. ‘సక్సెస్ ఫుల్ గా మూడో సీజన్ షూటింగ్ ముగిసింది. త్వరలో సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్ మీ ముందుకు రాబోతున్నాడు’’ని ఆయన రాసుకొచ్చారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రియమణి, షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also;UNIKA Book Release Event: ఒకే వేదికపై ప్రధాన పార్టీల నాయకులు.. మీ ఐఖ్యతకు సలాం!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!