NTV Telugu Site icon

Train Accident: వీడిన దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం మిస్టరీ..కారణం ఇదే..

Dibrugarh Express Train

Dibrugarh Express Train

గోండాలో చండీగఢ్‌-దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి సంబంధించి కుట్ర లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే ప్రమాదం అనంతరం లోకో పైలట్‌కు సంచలన విషయం వెల్లడించారు. ప్రమాదానికి మందు పెద్ద పేలుడు శబ్ధం వినిపించిందని తెలిపారు. దీంతో ప్రమాద ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ పేలుడు శబ్ధం వెనుక మిస్టరీ వెలుగులోకి వచ్చింది. ట్రాక్ నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇంజినీరింగ్ విభాగాన్ని హెచ్చరించినట్లు ఉమ్మడి నివేదికలో చెప్పబడింది. అధికారుల రెండు నిమిషాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది. రెండు నిమిషాలు నలుగురి ప్రాణాలను, మరెంతో మందిని క్షతగాత్రులను చేశాయి. ప్రభుత్వానికి కూడా భారీగా నష్టం వచ్చింది. ఎందరో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది.

READ MORE: Tirumala: రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ..

స్టేషన్ మాస్టర్‌కి ఆలస్యంగా హెచ్చరిక వచ్చింది..
ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం.. ఈ రైలు మధ్యాహ్నం 2:28 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే 2:30 గంటలకు స్టేషన్ మాస్టర్‌కు 30 kmph వేగ పరిమితిని నిర్ధారించాలని, వేగంగా వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేయబడింది. హెచ్చరిక ఆర్డర్ ప్రకారం.. రైలు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడపకూడదు. అయితే స్టేషన్‌మాస్టర్‌కు హెచ్చరిక అందే సమయానికి రైలు ట్రాక్‌లో లోపం ఉన్న ప్రదేశానికి చేరుకుంది. 2:32 గంటలకు రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయని ఉమ్మడి నివేదికలో కూడా రాశారు. రైలు 2:28కి స్టేషన్ దాటడానికి 2 నిమిషాల ముందే స్టేషన్ మాస్టర్‌కు హెచ్చరిక అందజేసి ఉంటే.. బహుశా ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని నివేదికలో స్పష్టమైంది. ట్రాక్‌లో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ట్రాక్‌లో కొంత అవాంతరాలున్నట్లు పట్టాలు తప్పినందుకు సంబంధించిన ఉమ్మడి నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. 350 మీటర్ల మేర ట్రాక్‌ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు.