Site icon NTV Telugu

CONG-CPI: కాంగ్రెస్-సీపీఐ పొత్తులపై నిర్ణయం కేంద్ర కమిటీకి అప్పగింత

Cong Cpi

Cong Cpi

CONG-CPI: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సీపీఐ కార్యవర్గ సమావేశం అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్‌తో పొత్తుపై భిన్నాభిప్రాయాలు రావడంతో రాష్ట్ర సీపీఐ తుది నిర్ణయాన్ని కేంద్ర కమిటీకి అప్పగిస్తూ కమిటీ తీర్మానం చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడం సీటు ఇచ్చినా… మునుగోడులో పోటీ చేస్తామని నల్గొండ జిల్లా సీపీఐ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే.. కొత్తగూడం సీటుపై కూడా కాంగ్రెస్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Read Also: Thalapathy Vijay: షాకింగ్.. హాస్పిటల్లో విజయ్.. అసలేమైంది.. ?

సీఐపీ కాంగ్రెస్ తో పొత్తుపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. కాంగ్రెస్ తో చర్చలు సాగుతున్నాయని తెలిపారు. రేపు చర్చలు జరుగుతాయని.. కేంద్ర కమిటీకి చెప్పామన్నారు. త్వరలోనే కీలక ప్రకటన చేస్తామని కూనంనేని వెల్లడించారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. అంతేకాకుండా.. 17 నియోజకవర్గాలకు అభ్యర్ధులను కూడా ఆయన వెల్లడించారు. భద్రాచలం, అశ్వారావుపేటతో పాటు ఖమ్మంలో 5, నల్గొండలో 3, సూర్యాపేట జిల్లాలో 2 సీట్లలో పోటీ చేస్తామని వీరభద్రం తెలిపారు. వైరా, భద్రాచలం, పాలేరు తమకు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరామని.. అయితే వైరా, మిర్యాలగూడ ఇస్తామని ఆ పార్టీ చెప్పిందని.. తర్వాత వైరా కూడా ఇచ్చేది లేదని చెప్పిందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Yogi Adityanath: ఆడపిల్లల్ని వేధిస్తే రావణుడి గతి తప్పదు..

Exit mobile version