NTV Telugu Site icon

Tamil Nadu: బతికున్న 2447 తాబేళ్లను చాక్లెట్ బాక్స్‌ల్లో ఉంచి.. అక్రమ రవాణా(వీడియో)

Tamil Nadu

Tamil Nadu

తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన పార్శిల్ నుంచి 2447 బతికున్న తాబేళ్లను కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఈ విషయమై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసు కేసు నమోదు చేసింది. ఇప్పుడు కస్టమ్స్ బృందం, పోలీసులు ఈ తాబేళ్లను ఎవరు తీసుకువచ్చారు? వాటిని తిరుచ్చి విమానాశ్రయం నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

READ MORE: Koneru Hampi: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ కైవసం

కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మలేషియా కౌలాలంపూర్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న విమానంలో తాబేళ్లు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆదివారం ఉదయం సమాచారం అందింది. ఈ విమానంలో పెద్ద మొత్తంలో తాబేళ్లను ఉంచారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన కస్టమ్స్ బృందం విమానం ల్యాండ్ అయిన వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. ఈ సమయంలో అనుమానాస్పదంగా కొన్ని చాక్లెట్ల బాక్స్‌లు కనిపించడంతో బృందం వాటిని తెరిచి పరిశీలించింది. ఈ కంపార్ట్‌మెంట్లన్నీ తాబేళ్లతో నిండిపోయాయి. అందులో దాదాపు 2447 తాబేళ్లు ఉన్నాయి.

READ MORE: Flight Accidents: డిసెంబర్‌ నెలలో 6 విమాన ప్రమాదాలు.. 236 మంది మృతి..

చాక్లెట్ బాక్సుల స్మగ్లింగ్‌లో ఇది మొదటిది కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చాక్లెట్ బాక్సుల్లో మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడం బట్టబయలైంది. తిరుచ్చి విమానాశ్రయంలోనే ఇలాంటి మూడు-నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే చాక్లెట్ బాక్సుల్లో తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ఉదంతం మాత్రం తొలిసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కస్టమ్ శాఖ అటవీ శాఖ అధికారులను పిలిచి తాబేళ్లన్నింటిని తమ రక్షణలో అప్పగించింది.