NTV Telugu Site icon

Tall people: ప్రపంచంలోనే అత్యధిక పొడవాటి వ్యక్తులున్న దేశం ఏదో తెలుసా?

Nedarlands

Nedarlands

గత కొన్ని దశాబ్ధాల వరకు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పొడవాటి వ్యక్తులున్న దేశంగా అమెరికాను చెప్పేవారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పొడవాటి వ్యక్తులు ఉన్న దేశం నెదర్లాండ్స్ అవతరించింది. ఇక్కడి ప్రజల సగటు ఎత్తు 184 సెంటీమీటర్లు.. అంటే దాదాపు 6.03 అడుగులు. 18వ శతాబ్దం వరకు.. నెదర్లాండ్స్, ఐరోపాలోని చాలా దేశాలలో ప్రజల సగటు ఎత్తు 165 సెంటీమీటర్లు ఉండేది. కానీ గత 200 ఏళ్లలో డచ్ ప్రజల ఎత్తు సగటున 15 సెంటీమీటర్లు పెరిగింది.

READ MORE: Tamil Nadu: 24 గంటల్లో రెండు రాజకీయ హత్యలు.. బీజేపీ కార్యకర్తని నరికి చంపిన దుండగులు..

ఓ మీడియా కథనం ప్రకారం.. నెదర్లాండ్స్‌లో మహిళల సగటు ఎత్తు 168.5 సెంటీమీటర్లు (5.52 అడుగులు)లు గా ఉంది. పురుషుల సగటు ఎత్తు 184 సెంటీమీటర్ల వరకు ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు.. అమెరికన్లను ప్రపంచంలోనే ఎత్తైనవారిగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు నెదర్లాండ్స్ వారిని అధిగమించింది. అమెరికన్ పురుషుల సగటు ఎత్తు 177.2 సెంటీమీటర్లు (5.8 అడుగులు)లుగా ఉంది. అయితే స్త్రీల సగటు ఎత్తు 163.25 సెంటీమీటర్లు (5.3 అడుగులు)కు చేరుకుంది.

READ MORE: Manu Bhaker: మను భాకర్ కి రాష్ట్రపతి, ప్రధానితోసహా పలువురి ప్రశంసలు..

రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ప్రకారం.. 18వ శతాబ్దం వరకు, నెదర్లాండ్స్ ప్రజలు ఎత్తు పరంగా ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా ఉండేవారిగా పరిగణించబడ్డారు. అయితే గత 200 సంవత్సరాలలో ఊహించనిది జరిగింది. నెదర్లాండ్స్ ప్రజలు అమెరికన్లను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తులు కలిగిన దేశంగా గుర్తింపుపొందింది. నెదర్లాండ్స్ ప్రజల ఔన్నత్యాన్ని అధ్యయనం చేసిన కెనడాలోని లెత్‌బ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లూయిస్ బారెట్ డచ్ ప్రజల ఎత్తును పెంచడంలో జన్యుశాస్త్రం పాత్ర పోషిస్తుందన్నారు. వారు అంత ఎత్తుగా ఉండేందుకు ఆహారం, పానీయాలు, నాణ్యత వంటి అనే కీలకమని తెలిపారు. వీటి కారణంగానే.. గత కొన్ని దశాబ్దాలుగా నెదర్లాండ్స్‌లో జీవన ప్రమాణాలు మారిపోయాయని.. అంటు వ్యాధుల కారణంగా మరణాల సంఖ్య తగ్గిందని వెల్లడించారు.

READ MORE:Gottipati Ravikumar: రామయ్య సాహసమే ఉద్యోగులకు స్పూర్తి.. లైన్మెన్ను అభినందించిన మంత్రి

ప్రొఫెసర్ లూయిస్ బారెట్ మాట్లాడుతూ.. “డచ్ ప్రజల ఎత్తు పెరగడానికి పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు ఎక్కువగా దోహదపడ్డాయి. గత కొన్ని సంవత్సరాలలో, నెదర్లాండ్స్‌లో అనేక పాడి పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. పాల ఉత్పత్తులపై ప్రజల ఆధారపడటం పెరిగింది. దీని కారణంగా.. ఎముకలను బలోపేతం చేయడానికి, ఎత్తు పెరిగేందుకు కాల్షియం చాలా ముఖ్యం. ఇక్కడి ప్రజలకు కాల్షియం పుష్కలంగా ఉంది.” అని పేర్కొన్నారు.