NTV Telugu Site icon

Israel Hamas War: గాజాలో రోజురోజుకు దిగజారిపోతున్న మహిళలు, చిన్నారుల పరిస్థితి

Gaza

Gaza

Israel Hamas War: అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-గాజా యుద్ధం ఆగిపోయే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ రక్తపాత సంఘర్షణలో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సుమారు 16 వేల మంది ఈ యుద్ధంలో మరణించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడి తర్వాత ప్రతి గంటకు ఇద్దరు తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ యుద్ధం జరిగి 100 రోజులకు పైగా గడిచినా ఇప్పటి వరకు పరిష్కారం మాత్రం దొరకలేదు.

Read Also: Rolls Royce Spectre : రూ.7.5కోట్ల రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు లాంచ్.. లగ్జరీ కారు ఫీచర్లు ఇవే

అయితే, తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ యుద్ధం వల్ల సుమారు 3,000 మంది మహిళలు వితంతువులుగా మారినట్లు తెలిపింది. అలాగే, దాదాపు 10,000 మంది చిన్నారులు తమ తండ్రులను కోల్పోయారు. ఈ ప్రాంతంలోని 2.3 మిలియన్ల జనాభాలో 1.9 మిలియన్లు నిరాశ్రయులయ్యారు.. దాదాపు పది లక్షల మంది మహిళలు, చిన్నారులు ఆశ్రయం, రక్షణ కోసం వెతుకుతున్నారని తెలిపింది. ఇక, అక్టోబర్ 7న జరిగిన ఇజ్రాయెల్-హమాస్ దాడిపై UN ఉమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ మాట్లాడుతూ.. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో మరణించిన పౌరులందరిలో 67 శాతం మంది పురుషులు ఉండగా14 శాతం కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారని ఆమె సూచించారు.

Read Also: Hanuman Collections: అల వైకుంఠపురములో అవుట్… నెక్స్ట్ టార్గెట్ ప్రభాస్-జక్కన్న సినిమాలే…

మానవతావాద దృక్పథంతో కాల్పుల విరమణ చెయ్యాలని అమెరికా సూచించింది. ఇజ్రాయెల్‌లో బందీలుగా ఉన్న వారందరినీ తక్షణమే విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపుని కూడా SIMA పునరుద్ఘాటించింది. కాగా, ప్రస్తుతం గాజాలో మహిళలు, చిన్నారుల పరిస్థితి దారుణంగా దిగజారి పోయిందన్నారు. గాజాలో ఉన్న వారి కోసం భద్రత, వైద్య సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, ఆశ్రయం కల్పించాలని గుటెర్సెస్ కోరారు. అయితే, హమాస్ ఆధ్వర్యంలో ఉన్న గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఘర్షణలో దాదాపు 25,000 మంది పాలస్తీనియన్లు మరణించారని తెలిపారు. వారిలో 70 శాతం మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని చెప్పుకొచ్చారు. గాజా జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ఆకలితో చనిపోతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. గాజాలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ బందీలు ఇప్పటికీ ఉన్నట్లు భావిస్తున్నారు.