నెలకొక సారి అయినా ఉన్నత ఉద్యోగంలో ఉన్నవాళ్లు స్వంత ఊర్లకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వెనుకబడ్డ వారి సమస్యలు అడిగి తెలుసుకోండని.. స్ఫూర్తి కలిగించండన్నారు. “లీడర్ అంటే లీడ్ చేసే వాడు. కానీ గృహ ప్రవేశాలు అంటూ దావత్ లు చేసుకుంటున్నామని బయటకు చెప్తున్నారు. దీపావళికి అందరూ చుచ్చుబుడ్డిలు వెలిగిస్తే.. కొంతమంది సారా బుడ్డిలు ఓపెన్ చేస్తూ… ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు డ్రగ్స్ తీసుకునే నిబంధనలు అతిక్రమిస్తుంటే… వాళ్ళనీ ప్రోత్సహిస్తున్నారు.. వాళ్ళనీ ఏమనాలి. మన పిల్లలు వ్యసనాలకు అలవాటు పడితే ఎంత డబ్బు ఉన్న ఉపయోగం లేదు. పోలీస్, రవాణా శాఖ వాళ్ళకి సూచిస్తున్న..నిన్న ఒక పెద్దయన చాలాకాలం తర్వాత బయటకి వచ్చి, జనం నష్ట పోయారు అంటాడు. నష్ట పోయింది మీ 4 నలుగురుకి ఉద్యోగం పోయింది అది మాత్రమే నష్టం. కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం వినియోగించుకుని మహిళలు బస్సులు ఎక్కుతున్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం 10 లక్షలు వినియోగించుకుంటూ వైద్యం చేసుకుంటున్నారు.” అని సీఎం వ్యాఖ్యానించారు.
READ MORE: PM Modi : సమాజాన్ని ముక్కలుగా విభజించే కుట్ర.. అర్థం చేసుకోండి : ప్రధాని మోడీ
500 రూపాయలకు గ్యాస్ అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగా ఎంపికైన ఏఎమ్‌వీఐలు సామాజిక బాధ్యత తీసుకుని స్థానిక పాఠశాలల్లో విద్యార్థుల వద్దకు వెళ్లి చదువుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. కొంతమంది దీపావళి రోజు సారా బుడ్లతో దీపావళి పండుగ జరుపుకుంటున్నారని.. వారిని సామాజిక బహిష్కరణ చేయాలని సీఎం మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి వారు ఆదర్శమా.. శ్రీకాంతాచారీ, ఇషాంత్ రెడ్డి వంటి వారిని ఆదర్శంగా తీసుకొవాలా..? ఆలోచించాలన్నారు. “పక్క రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి గంజాయి రవాణా ను అడ్డుకోవడంలో రవాణా శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రూప్ 1 పరీక్షలను 12 ఏళ్లుగా నిర్వహించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 563 మందికి నోటిఫికేషన్ ఇచ్చాం…త్వరలోనే వారు అందుకుంటారు తెలంగాణ సమాజం ఏం కోల్పోలేదు. నిన్ను మరిచిపోయింది. బడి దొంగలను చూశాం.. కానీ అసెంబ్లీకి రాని వారిని చూడలేదు. రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండవ విడత జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం.” అని సీఎం తెలిపారు.