NTV Telugu Site icon

Bandi Sanjay: సీఎం రాష్ట్రాన్ని హరిఘోష పెడుతున్నాడు.. కేసీఆర్ కుటుంబం జైలుకు పోవడం ఖాయం..

Bandi

Bandi

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన సెటిల్ మెంట్ కోసమే.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నట్లు బండి సంజయ్ ఆరోపించారు. అటు మంత్రి కేటీఆర్ నలుగురు బీజేపీ కార్పొరేటర్ లు టచ్ లో ఉన్నారు అని అంటున్నాడు.. మాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. తాము రాజకీయ వ్యభిచారులం కాదని… బీజేపీలో చేరాలి అంటే రాజీనామా చేయాలన్నారు. అంతేకాకుండా అటు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు బండి సంజయ్. కాంగ్రెస్ ను జాకీ పెట్టిన లేవదని విమర్శించారు.

Read Also: Tamil Nadu: తమిళనాడులోకి సీబీఐకి నో పర్మిషన్.. సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం..

అటు ఇటు కానోడితో ఎవరన్నా సంసారం చేస్తారా అని వ్యంగ్యంగా మాట్లాడారు బండి సంజయ్. అంతేకాకుండా BRS కాంగ్రెస్ కు స్పాన్సర్ చేస్తున్నారని ఆరోపించారు. BRS ఓడిపోతుందని తెలిసిన 30 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ నేతలకు కెసిఆర్ డబ్బులు ఇస్తున్నాడన్నారు. మరోవైపు ధరణికి రైతు బంధుకు ఏమీ సంబందం కేసీఆర్ చెప్పాలని అన్నారు. కేసిఆర్ కుటుంబం కోసమే ధరణి ఏర్పాటు చేసుకున్నారని.. ధరణి రాష్ట్రంలో ఏవిధంగా నడుస్తుందో తెలుసుకోవడానికి కేసీఆర్ నాతో నడిచే దమ్ముందా అని బండి సంజయ్ పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణలో నిరుద్యోగ యువతను మోసం చేయడానికే దొంగ నోటిఫికేషన్ లు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ భూమి పూజ చేసిన శిలాఫలకాలతో మరో సెక్రటేరియట్ కట్టవచ్చని బండి సంజయ్ ఆరోపించారు. మరోవైపు రాష్ట్రాన్ని సీఎం హరిఘోష పెడుతున్నాడని విమర్శించారు. ఇక కేసీఆర్ కుటుంబానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని.. జైలుకు పోవడం గ్యారంటీ బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు.