రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుండి జనవరి 2 వరకు సీఎం కప్ క్రీడోత్సవాలు (CM’s Cup 2024) జరుగనున్నాయి. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. ఈ క్రీడోత్సవాలు 36 ఈవెంట్స్‌లో మూడు దశల్లో నిర్వహించనున్నట్లు శివసేనా రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 7, 8 తేదీలలో గ్రామ పంచాయితీ స్థాయిలో క్రీడా పోటీలు జరుగనున్నాయి. కాగా.. ఈ నెల 7, 8 తేదీల లోపు ఆన్‌లైన్‌లో cmcup2024.telangana.gov.inలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ.. క్రీడాకారులకు విజ్ఞప్తి చేసింది.
Read Also: Under 19 Asia Cup: జపాన్‌కు ఇచ్చిపడేసిన భారత్.. అమన్ అజేయ సెంచరీ
శనివారం నుంచి ప్రారంభం కానున్న ఆన్‌లైన్ ప్రక్రియలో ఉత్సాహంగా గ్రామీణ క్రీడాకారులు తమ సమాచారాన్ని పొందుపరుచాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది. 7, 8వ తేదీల్లో మొదటగా గ్రామ స్థాయిలో పోటీలు, 10–12వ తేదీల్లో మండల స్థాయి పోటీలు, 16–21 తేదీల్లో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. అయితే.. పోటీలలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు తన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా.. వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
Read Also: IPS officer: విషాదం.. పోస్టింగ్‌కి వెళ్తుండగా యువ ఐపీఎస్ అధికారి మృతి..