NTV Telugu Site icon

CM Revanth Reddy: కలెక్టర్లతో ముగిసిన ముఖ్యమంత్రి సమావేశం.. కీలక ఆదేశాలు

Cmrevanthreddy

Cmrevanthreddy

సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందని.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లేది కలెక్టర్లేనని అన్నారు. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం అని తెలిపారు. కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు.

Game Changer : గేమ్ ఛేంజర్ అప్పన్న గురించి సాయి దుర్గా తేజ్ ఏమన్నారంటే ?

క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చాం.. కానీ కొంతమంది ఇంకా ఆఫీసులలో కూర్చునే పనిచేయాలని భావిస్తున్నారని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సమస్యలు వచ్చినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.. మీ పని తీరును మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు.. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో రైతు పెట్టుబడి సాయం అందించారు.. అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో వెళ్లి అనర్హులను గుర్తించాల్సిందే.. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలన్నారు. రాష్ట్రంలో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నాం.. తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలని సీఎం కలెక్టర్లకు చెప్పారు. ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ పూర్తి చేయాలని తెలిపారు.

CM Revanth Reddy: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం సూచనలు..

కలెక్టర్లు అర్హుల జాబితాను ఇంఛార్జి మినిస్టర్ కు అందించాలని సీఎం చెప్పారు. ఇంఛార్జ్ మినిస్టర్ ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలన్నారు. జనవరి 26న అంత్యంత ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేయబోతున్నాం.. ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, గొప్పగా పనిచేస్తున్నదన్న నమ్మకం ప్రజలకు కలిగించాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలని తెలిపారు. మహిళా అధికారులు బాలికల హాస్టల్స్‌కు వెళ్లి అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపండని చెప్పారు. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోండి.. జనవరి 26 తరువాత తాను ఆకస్మిక తనిఖీలు చేస్తానని అన్నారు. నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కలెక్టర్లను హెచ్చరించారు.

Show comments