నిబద్ధత, విశ్వాసంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై.చంద్రచూడ్ అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ఎస్వీయూ న్యాయశాఖ 10వ వార్షికోత్సవ వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Read Also: Seshu Passes Away: ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ కన్నుమూత
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ధనంజయ వై.చంద్రచూడ్ మాట్లాడుతూ.. సమర్ధత, నిజాయితీ, నిస్పాక్షిత వంటి లక్షణాలను చిన్నప్పటి నుంచే అలవరుచుకుంటే ఉన్నతస్థానంలోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుందన్నారు. న్యాయవాదవృత్తి ఎంతో గొప్పదని..ఆ వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు న్యాయవృత్తిని గౌరవిస్తూ విద్యనభ్యసించాలన్నారు. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని న్యాయవాద వృత్తిని తాను ఎంచుకున్నట్లు చెప్పారు. న్యాయవాద వృత్తిని తాను దైవంగా భావిస్తానన్నారు. న్యాయవాద వృత్తిని పురుషులతో సమానంగా మహిళలు కూడా ఎంచుకుంటుండడం సంతోషించదగ్గ విషయం అన్నారు.
Read Also: IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ విడుదల.. అడిలైడ్‌లో డే నైట్ టెస్టు
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డీవై చంద్రచూడ్ ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అందులో భాగంగా.. ఈరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో సీజేఐ చంద్రచూడ్ దంపతులు తిరుపతి నుంచి తిరుమల చేరుకోనున్నారు. రాత్రికి తిరుమలలోని శ్రీరచనా అతిధి గృహంలో బస చేస్తారు. రేపు(బుధవారం) తెల్లవారుజామున తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత రేపు ఉదయం 9 గంటలకు తిరుమల నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. రేపు ఉదయం 11 గంటలకు తిరుపతి, తిరుమల పర్యటన ముగించుకోని హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.