స్వస్తిశ్రీ ప్లవ నామ సంవత్సర శ్రావణ శుక్ల చతుర్దశి తేదీన అనగా 21-08-2021 శనివారం రోజున ”శ్రీ శ్రీనివాస కళ్యాణం” ను ”ది చెన్నై సిల్క్స్ మరియు కుమరన్ గోల్డ్ & డైమెండ్స్” వారు నిర్వహిస్తున్నారు. కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ది చెన్నై సిల్క్స్ భవనం 4 వ అంతస్థులో ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 11 గంటలకు ముగుస్తుంది. ఈ కళ్యాణంను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి శిష్య బృందం జరిపించనున్నారు. కావున తామెల్లరు విచ్చేసి స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ వివాహమును మీరు భక్తి టీవీ యూట్యూబ్ ఛానెల్ లైవ్ లో కూడా వీక్షించే అవకాశం ఉంది. ప్రీ బుకింగ్ అలాగే ఈ కార్యక్రమంకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 7995474442 నెంబర్ ను సంప్రదించగలరు.