బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ఆయన్ని ఎనర్జీ కి బాప్ అని అందరు అంటారు.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది.. ఏ ఈవెంట్ కు వచ్చినా కూడా ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు.. ఫుల్ జోష్ ను నింపుతాడు. ఎప్పుడూ ఫుల్ జోష్‍తో ఉంటారు. అంతేకాదు ఆయన ఫ్యాషన్ ఐకాన్ గురించి ఎంత చెప్పిన తక్కువే… ఖరీదులో వెనక్కి తగ్గడు.. తాజాగా ఆయన ధరించిన ఓ చైన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
ఇటీవల ముంబైలో జరిగిన ఓ గాలా ఈవెంట్ లో ఈ హీరో పాల్గొన్నాడు.. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఆయన వేసుకున్న డ్రెస్స్, హైహీల్స్ తో పాటు మెడలో ధరించిన డైమండ్స్ పొదిగిన ఒక చైన్ అందరిని ఆకట్టుకుంది. అందరి చూపు దానిమీదే.. ఆ నగ ధర ఎంత ఉంటుందో అని ఆయన ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు.. రణవీర్ తెల్లటి శాటిన్ షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్‌లో హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఆయన ఉబెర్-స్టైలిష్ వైట్ బెల్ట్‌తో తన లుక్ ను పూర్తి చేశాడు. అలాగే బ్లూ సన్ గ్లాసెస్ కూడా ధరించాడు..
ఈ హీరోకు నెక్లేస్ లు కలెక్ట్ చెయ్యడం సరదా.. నెక్లెస్ లు, హై హీల్స్ చాలా తక్కువగా వేసుకుంటారు. కానీ తాజాగా రణ్‌వీర్ వాటినే ధరించి ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చి అందరిని అశ్చర్యానికి గురి చేశాడు.. అయితే చైన్ ధర అక్షరాల 2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు..బెస్పోక్ టిఫనీ నెక్లెస్ ధరించి కనిపించారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆ డైమండ్ నెక్లెస్ ధర విని షాక్ అవుతున్నారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..