IndiGo Refund Issue: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం వల్ల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక అనేక ఇబ్బంది పడుతున్నారు. వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్య సహాయం అందాల్సిన ప్రయాణికులు సీట్లు దొరకకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలపై నియంత్రణ ఉండేలా, ఎక్కువ రేట్లు పెంచడాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: November Tollywood: చిన్న సినిమాల హవా, మూడు మాత్రమే బ్రేక్ ఈవెన్
అయితే, ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్‌లైన్స్, ట్రావెల్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంతో పాటు ఎప్పటికప్పుడు ధరలను పర్యవేక్షిస్తుందన్నారు. కరోనా సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇలా ధరల పరిమితిని విధించిందని గుర్తు చేశారు. అలాగే, ఎలాంటి జాప్యం లేకుండా పెండింగ్‌లో ఉన్న రీఫండ్లను తక్షణమే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. రద్దైన, ఆలస్యం అవుతున్న విమాన సర్వీసులకు సంబంధించి రీఫండ్ ప్రక్రియను రేపు (డిసెంబర్ 7) రాత్రి 8 గంటల కల్లా పూర్తి చేయాలని తెలియజేసింది. రద్దు కారణంగా ఇప్పటికే ప్రభావితమైన ప్రయాణికులపై రీ షెడ్యూలింగ్ ఛార్జీలు విధించొద్దని కూడా పేర్కొంది.
Read Also: Aryan Khan FIR: బాలీవుడ్ స్టార్ కుమారుడిపై కేసు.. ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసిన సంఘటన..
ఇక, ప్రయాణికుల లగేజీలను 48 గంటల్లో ఎవరివి వాళ్లకి అప్పగించాలని కేంద్రం తెలియజేసింది. ఈ రీఫండ్ ప్రక్రియలో జాప్యం చేసినా లేక ఆదేశాలను బేఖాతరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే, గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో ఇండిగో సర్వీసులు రద్దవుతున్నాయి. ఈరోజు (డిసెంబర్ 6న) కూడా పలు ఎయిర్‌పోర్టుల్లో వందలకు పైగా సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుంది.. కొన్ని సరీసులపై ప్రభావం కొనసాగుతోందని చెప్పింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ కూడా రంగంలోకి దిగింది. కొన్ని రైళ్లకు అదనపు బోగీలను జోడించడంతో పాటు ప్రత్యేకంగా పలు రైళ్లను కూడా నడుపుతుంది.
Ministry of Civil Aviation has directed IndiGo to clear all pending passenger refunds without delay and mandated that the refund process for all cancelled or disrupted flights must be fully completed by 8:00 PM on Sunday, 7 December 2025.
Ministry has directed IndiGo to ensure…
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) December 6, 2025
