Central Election Commission: ఏపీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఈ క్రమంలో.. రేపు ఎన్నికల అధికారుల బృందం విజయవాడ చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఈ నెల 9వ తేదీన వివిధ రాజకీయ పార్టీలతో భేటీ కానున్నారు.
Read Also: Byreddy Rajasekhar Reddy: రెడ్లు అంటే త్యాగానికి దానానికి వీరత్వానికి మారు పేరు..
ఓటర్ల జాబితాలో అవకతవకలు, పార్టీల ఫిర్యాదులపై రాష్ట్ర సీఈవోతో సీఈసీ సమీక్ష చేయనుంది. అనంతరం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నద్ధత పై ఈనెల 10న ప్రజెంటేషన్ ఇవ్వనుంది సీఈవో. మరోవైపు.. ఎన్నికల కమిషన్, కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఈసీ భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే.. ఈనెల 10న సాయత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజు కేంద్ర ఎన్నికల బృందం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
Read Also: Dr. Gedala Srinubabu : ఆధునిక లాభసాటి వ్యవసాయం వైపు `సాగు`దాం
