NTV Telugu Site icon

Amrapali : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాక్..

Ias

Ias

తెలంగాణ కేడర్ కావాలని విజ్ఞప్తి చేసిన 11మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు కేంద్రం నో చెప్పింది. ఈ 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలోనే రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డీఓపీటీ (DOPT) ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలి.. తనకు తెలంగాణ కేడర్ కావాలని కోరింది. దీనిపై సమీక్షించిన డీఓపీటీ.. తెలంగాణ కేడర్ ను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ కూడా ఇదే ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 11 మంది ఐఏఎస్‌లు తెలంగాణ కేడర్ కావాలని కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. 2014 ఏపీ విభజన తర్వాత.. తెలంగాణ కేడర్ కావాలని కేంద్రాన్ని 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు కేంద్రాన్ని కోరారు.

Read Also: Ratan Tata: వృద్ధాప్యంలో రతన్ టాటాకు అండగా నిలిచిన యువకుడు ఎవరు?

తెలుగు రాష్ట్రాల్లో ఆలిండియా సర్వీసెస్ అధికారుల మార్పులను చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గడిచిన 10 సంవత్సరాలలో డీఓపీటీకి సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటేషన్ మీద పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పని చేస్తున్న 11 మంది ఐఏఎస్‌లు తక్షణమై రిలీవ్ అయి ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఢిల్లీలో జరిగిన డీఓపీటీ సమావేశానికి వీరంతా హాజరయ్యారు. ఆ సమావేశంలో సొంత రాష్ట్రాలకు వెళ్లలేమని పిటిషన్ ఇచ్చారు. ఈ క్రమంలో.. ఆ పిటిషన్ క్యాన్సిల్ అయింది. సొంత రాష్ట్రాలకు వెళ్లాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చింది.

Ratan Tata Dog: రతన్ టాటా భౌతికకాయం దగ్గర దీనంగా కూర్చున్న కుక్క

తెలంగాణలో పనిచేస్తున్న వారిలో ఐఏఎస్ 2004 ఐఏఎస్ వాకాటి కరుణ, 2006 బ్యాచ్ రోనాల్డ్ రోస్, 1995 ఐఏఎస్ బ్యాచ్ వాణీ ప్రసాద్, 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలి కాట, 2009 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ప్రశాంతి ఏపీ క్యాడర్ కు చెందిన బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఏపీ క్యాడర్ నుంచి 1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన మాజీ డీజీపీ అంజన్ కుమార్, 1994 ఐపీఎస్ బ్యాచ్ అభిలాష బిస్త్, 2011 ఐపీఎస్ బ్యాచ్ అభిషేక్ మహంతిలు తెలంగాణలో పని చేస్తున్నారు.

Show comments