Site icon NTV Telugu

Buffaloes: పులిని చంపిన గేదెలు.. ఐకమత్యమంటే ఇదేరా..!

Buffellos

Buffellos

ఐకమత్యమే మహా బలం అని చిన్నప్పుడు మనం చదువుకునే ఉంటాం.. ఇప్పుడు అది నిజమని నిరూపించేలా ఓ సంఘటన జరిగింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలుకా పరిసరాల్లో ఈ సంఘటన జరిగిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణంగా పులి దాడిలో గేదె మృతి అనే న్యూస్ ను మనం చూస్తుంటాం కానీ.. గేదెలు పులి మీద మూకుమ్మడిగా దాడి చేసి చంపేస్తే అది ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు.

Read Also: Srinivas Goud: కల్తీ మద్యంపై తొలి పీడీ యాక్ట్.. కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి వార్నింగ్

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా మూల్‌ తాలూకా పరిసరాల్లో కొంతకాలంగా పులి సంచరస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురి అవుతున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే, గురువారంనాడు ఉదయం మూల్‌ తాలూకాలోని ఎస్‌గావ్‌ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై పులి దాడికి యత్నించిందని.. చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు తిరగడంతో త్రుటిలో అతడికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ఆ తర్వాత బెంబాడా గ్రామంలోని అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న గేదెలపై పులి దాడి చేసిందని.. ఈక్రమంలో గేదెలు భయంతో పరుగెత్తకుండా.. ఐకమత్యంగా ఉండి పులిని తమ కొమ్ములతో పొడిచాయి.

Read Also: Short people: పొడవుగా ఉన్నవాళ్ల కంటే.. పొట్టిగా ఉన్నవాళ్లే ఎక్కువకాలం బ్రతుకుతారు..

దీంతో పులికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అక్కడే ఉన్న పశువుల కాపర్లు తమ ఫోన్లలో వీడియో తీశారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడికి చేరుకున్నారు. గాయపడిని క్రూర మృగాన్ని చంద్రపూర్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడి చికిత్స పొందుతున్న సమయంలోనే పులి పరిస్థితి విషమించడతో రాత్రి చనిపోయింది. కాగా.. పశువులు పులిపై దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Exit mobile version