Body Guard : ఎంత మనకింద పని చేసేవాళ్లనైనా చులకనగా చూడకూడదు. వాళ్లకు ఫ్యామిలీలు ఉంటాయి. ఖర్చులు ఉంటాయి. వాళ్లకు ప్రతినెల జీతం ఇవ్వకుంటూ వాళ్లు ఇబ్బందులు పడతారు. చాలా కాలం పాటు జీతం ఇవ్వకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. యజమాని ఎంతటివాడైనా నిలదీయడం సహజం. అలాంటి ఘటనే ఉగాండాలో మంగళవారం చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ నిలదీయడాలు లేవు. ఏకంగా తుపాకీ పెట్టి కాల్చేశాడు. చాలా కాలం నుంచి జీతం ఇవ్వడం లేదని ఓ మంత్రిని అతడి బాడీగార్డే కాల్చి చంపాడు.
Read Also: Auto workers: యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు ధర్నా.. మద్దతుగా భట్టివిక్రమార్క
సైన్యం, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హత్య ఓ ప్రైవేట్ వివాదంలో జరిగింది. బాధితుడు చార్లెస్ ఎంగోలా రిటైర్డ్ ఆర్మీ కల్నల్. ఆయన ప్రెసిడెంట్ యోవేరి ముసెవేని ప్రభుత్వంలో కార్మిక శాఖకు జూనియర్ మంత్రిగా పనిచేస్తున్నాడు. మంత్రి ఉగాండా రాజధాని కంపాలా శివారులోని ఎంగోలాలోని తన ఇంటిలో ఉన్నప్పుడు ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల అనంతరం అతడు కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ కాల్పులకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. కానీ.. గార్డుకు మంత్రికి వేతనాలపై గొడవ జరుగుతుందని స్థానిక ప్రెస్ నోట్ పేర్కొంది.
Read Also:Tamilnadu : తమిళనాడులో దారుణం.. ఐదుగురు చిన్నారులపై గ్యాంగ్ రేప్
ఒక మంత్రిగా ఉండి కూడా తనకు చాలా కాలంగా జీతాలు ఇవ్వలేదని బాడీ గార్డు ఆందోళన చెందుతున్నట్లు, అందుకే అతడు కాల్పులకు ఒడిగట్టాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు స్థానిక మీడియా పేర్కొంది. కాగా.. గత కొన్నేళ్లుగా ఈ దేశంలో జరిగిన తుపాకీ దాడుల్లో ఉన్నత స్థాయి అధికారులు మరణించారు. అయితే ఓ మంత్రి ఇలా చనిపోవడం ఇదే తొలిసారి. ఈ ఘటన దేశంలో ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. ఈ కాల్పులపై ఆర్మీ ప్రతినిధి బ్రిగ్ స్పందించారు. ఇది దురదృష్టకర సంఘటన అని.. దర్యాప్తు జరిపి ప్రజలకు వివరాలు తెలియజేస్తామని ట్వీట్ చశారు.