Site icon NTV Telugu

Sailing Week: గ్రాండ్ గా ముగిసిన 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్..

Governor

Governor

హుస్సేన్ సాగర్ లో నిర్వహిస్తున్న 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ గ్రాండ్ గా ముగిసింది. ఈ క్లోజింగ్ సెర్మనీలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు. అయితే.. ఈ ఈవెంట్ లో గెలిచిన విన్నెర్స్ కి గవర్నర్ ట్రోఫీ లని అందించారు. హుస్సేన్ సాగర్ లో వారం రోజులపాటు నేషనల్ ర్యాంకింగ్ ఈవెంట్ జరిగింది. లేసర్ క్లాస్, లేసర్ స్టాండర్డ్, లేసర్ 4.7 కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి. ఈ రేసెస్ లో దాదాపు 100 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. పోటీలని ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహించింది. అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరిగాయి.

Read Also: Vizag Minor Girl Case: విశాఖలో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు

ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి హుస్సేన్ సాగర్ నగరానికి గిఫ్టేడ్ లేక్ అని అన్నారు. దీన్ని క్లీన్ చేసుకోవాలి.. ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ చాలా క్లీన్ గా ఉండేదని అధికారులు చెప్పారు.. వీలైనంత త్వరగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.. హుస్సేన్ సాగర్ లో ఇంతపెద్ద ఈవెంట్ నిర్వహించిన ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్ ని గవర్నర్ అభినందించారు. 93 మంది ప్లేయర్లలో 17 మంది అమ్మాయిలు ఈ పోటీల్లో పాల్గొనడం గర్వకారణం.. అమ్మాయిలకు నా ప్రత్యేక అభినందనలు అంటూ తమిళ సై చెప్పారు. సెయిలింగ్ అనేది ఒక గేమ్ మాత్రమే కాదు.. మన జీవితంలో ఒడిదుడుగులని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది అని ఆమె తెలిపారు. ఏషియన్స్, ఒలింపిక్స్ లోను మోడల్స్ తీసుకురాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కోరారు.

Read Also: Madhav Bhupathiraju: రవితేజ సూపర్ హిట్ టైటిల్‌పై కన్నేసిన తమ్ముడి కొడుకు.. హిట్టు పక్కానే ఇక?

Exit mobile version