హుస్సేన్ సాగర్ లో నిర్వహిస్తున్న 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ గ్రాండ్ గా ముగిసింది. ఈ క్లోజింగ్ సెర్మనీలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు. అయితే.. ఈ ఈవెంట్ లో గెలిచిన విన్నెర్స్ కి గవర్నర్ ట్రోఫీ లని అందించారు. హుస్సేన్ సాగర్ లో వారం రోజులపాటు నేషనల్ ర్యాంకింగ్ ఈవెంట్ జరిగింది. లేసర్ క్లాస్, లేసర్ స్టాండర్డ్, లేసర్ 4.7 కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి.