NTV Telugu Site icon

Thatikonda Rajaiah : కడియం శ్రీహరి పద్మశాలి కులంలో పుట్టి బైండ్ల కులంలో పెరిగాడు.. రాజయ్య సంచలన వ్యాఖ్యలు

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య. పద్మశాలి కులంలో పుట్టిన తర్వాత బైండ్ల కులంలో పెరిగాడంటూ కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి చేసేవి మొత్తం బ్లాక్‌మెయిల్ రాజకీయాలు అంటూ, ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయంగా దళితులు ఎదిగితే ఏదో కేసు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడని ఆయన ఆరోపించారు.

Also Read : Russia-Ukraine War: 500 రోజులుగా కొనసాగుతున్న రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం..!

అంతేకాకుండా.. 14 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏ దళిత బిడ్డను రాజకీయంగా ఎదగనీయలేదని ఆయన ఆరోపించారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న మూడున్నర సంవత్సరాలు నియోజకవర్గానికి రాకుండా తిరిగావని, నువ్వు 14 సంవత్సరాలు మంత్రిగా ఉంటే ఘనపూర్ నియోజకవర్గ దగా పడ్డదని ఆయన మండిపడ్డారు. ఘనపూర్ నియోజకవర్గాన్ని ఏం చేద్దామని చాటు చాటు మీటింగులు పెడుతున్నావని, నీ కులం గురించి నువ్వు నిరూపించుకో అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా అక్కడ కేసీఆర్ ఇక్కడ రాజయ్య దళితులకు అండగా ఉంటామని, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి వర్ధన్నపేట నుండి కావ్యకు కు ఇవ్వాలని అడుగుతున్నవని ఆధారాలు బయటకి వస్తున్నాయన్నారు.

Also Read : MLC Jeevan Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ 4000 రూపాయలు ఇస్తాం

మాదిగల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాదరణ ఉన్న ఎమ్మెల్యేల దగ్గర వేలు పెట్టకూడదు అని కేసిఆర్ చెప్పాడని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లు నన్ను అడిగిన తర్వాత నిధులు కేటాయిస్తారన్నారు. ఎమ్మెల్యే కు తెలియకుండా నియోజకవర్గంలోకి రావడమే తప్పయితే , అభివృద్ధి పనులకు ప్రోస్టింగ్ ఇస్తూ శిలాఫలకాలు పెట్టొద్దు అని చెప్పడం సిగ్గుచేటన్నారు. లింగంపల్లి ప్రాజెక్టు కావాలి అని ప్రజలు అడుగుతే కాంట్రాక్టర్ ఇచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి శ్రీహరి అంటూ ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యానించారు.

Show comments