స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దగ్గర భజనపరుల సంఖ్య పెరుగుతోందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరిని చూస్తే సొంత పార్టీ నేతలే భయపడుతున్నారని విమర్శించారు. కడియం పని చేయాలంటే కమిట్మెంట్ కావాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కడియం అనుచరులు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో 1994-2004 నాటి కడియం నిరంకుశ పాలన మళ్లీ ప్రారంభమైందని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మీడియా సమావేశంలో కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు.
Also Read: KCR: రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఓపెన్ కోర్టు విచారణకు ఒప్పుకోకుంటే?
‘ఎమ్మెల్యే కడియం శ్రీహరి పని చేయాలంటే కమిట్మెంట్ కావాల్సి వస్తుంది. కమిట్మెంట్ అయితేనే కడియం శ్రీహరి దగ్గర పనులు అవుతున్నాయి. కడియం అంటే కమిట్మెంట్ కాదు.. కడియం అంటే కన్నింగ్. పని కావాలంటే మొదట కమిట్ అవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కడియం అనుచరులు డబ్బులు వసూలు చేస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో 1994-2004 నాటి కడియం నిరంకుశ పాలన మళ్లీ ప్రారంభమైంది. కడియం శ్రీహరిని చూస్తే సొంత పార్టీ నేతలే భయపడుతున్నారు. కడియం దగ్గర భజనపరుల సంఖ్య పెరుగుతుంది’ అని తాటికొండ రాజయ్య మండిపడ్డారు.
