కేసీఆర్ నన్ను ఎంచుకొని నియోజకవర్గాన్ని నా ద్వారా అభివృద్ధి చేపిస్తుండు అని అన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు ప్రజల బలం ఉందని, సమ్మక్క జాతరలోని ఏ హుండీలలో డబ్బులు వేసిన సమ్మక్కకి చెందుతాయని, నియోజకవర్గంలో ఎవరు పనులు చేసినా తన ఖాతా లోకి వస్తాయన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అయితే.. ఇదిలా ఉంటే.. గతకొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కడియం శ్రీహరికి మధ్య కోల్డ్ వార్ సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే.. వీరిద్దరి మధ్య వార్ కన్ఫర్మే అన్నట్లుగా రాజయ్య, శ్రీహరిలు పరోక్షంగా విమర్శలు సంధించుకుంటున్నారు. నిన్నటికి నిన్న కడియం శ్రీహరి ఓ కార్యక్రమానికి హాజరై.. ‘ఆ నాడు ఎన్టీఆర్, ఈనాడు కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే వినియోగిస్తున్నాని ఎక్కడ కూడా తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నాన్నారు.
Also Read : Harish Rao : వీటికి జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలి.. కేంద్రంను కోరిన హరీష్‌రావు
ఎప్పుడు కూడా కడియం శ్రీహరి నీతి, నిజాయితీగానే ఉంటాడు తప్ప ఎవరి వద్ద లంచం తీసుకునే ప్రయత్నం చేయడు. ఎవరికి తలవంచే ప్రసక్తి లేదు. మీరెవరూ తలదించుకునే పని చేయబోను’ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ రోజు తాటికొండ రాజయ్య మాట్లాడిన మాటలు కడియంకు కౌంటర్‌గానే అన్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో రాజయ్య చేసిన కామెంట్స్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి మరి.