టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. తాజాగా స్టార్ హీరోలతో సినిమాలపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. క్రియేటివిటీకి పెద్దపీట వేసే ఈ యువ దర్శకుడు, కమర్షియల్ హంగులతో కూడిన సినిమాల పట్ల తన అసహనాన్ని వ్యక్తపరిచారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక స్టార్ హీరో ఫ్యాన్ బేస్‌ను సంతృప్తి పరిచే రకమైన సినిమాలు తీసే టాలెంట్ నాకు లేదు’ అని చాలా ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు. నేటి కాలంలో దర్శకులందరూ స్టార్ హీరోల కాల్షీట్ల కోసం క్యూ కడుతుంటే, తరుణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read : Anil Ravipudi : బాలయ్య ఫ్యాన్స్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన అనిల్ రావిపూడి..
అయితే, ఆయనకు పూర్తిగా యాక్షన్ చిత్రాలపై ఆసక్తి లేదని మాత్రం కాదు..‘బహుశా ‘ధురంధర్‘(Dhurandhar) లాంటి విభిన్నమైన సినిమా అయితే ట్రై చేయగలను‘ అని తన అభిప్రయాని తెలిపాడు.‘ధురంధర్‘ అనేది బాలీవుడ్ లో కోత్త ఒరవడిరి సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అంటే, దీనిబట్టి తరుణ్ ఒక వేల సినిమా చేసినా, అది రొటీన్ మాస్ మసాలా కాకుండా, ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండే అవకాశం ఉందని దీని ద్యానా అర్థమవుతోంది. కేవలం బాక్సాఫీస్ లెక్కల కోసం కాకుండా, కథలోని కోత్తదనం కోసం పరిచేసే తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు ఉండటం టాలీవుడ్ కు ఒక రకంగా మంచి విషయమే. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.