Thandel Twitter Review: ప్రపంచవ్యాప్తంగా నేడు (ఫిబ్రవరి 7) విడుదలైన ‘తండేల్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదటి షోలు పడటంతో సోషల్ మీడియాలో సినిమాపై రివ్యూలు మోత మోగుతున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి జంట మరోసారి అభిమానులను ఫిదా చేసినట్లే అర్థమవుతోంది. ‘తండేల్’ సినిమా కథ విషయానికి వస్తే.. కొంచెం స్లోగా ఉన్న కానీ, ఎమోషనల్ కంటెంట్ కరెక్ట్‌గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం కొంచెం కృత్రిమంగా ఉందని, కాస్త ‘క్రింజ్’ ఫీలింగ్ ఇచ్చిందని కొందరు అభిప్రాయాలను తెలుపుతన్నారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందని, నాగ చైతన్య మరోమారు నటన అందరిని ఆకట్టుకుందని చెప్పుకుంటున్నారు. ఇక మరోవైపు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే మరోసారి తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా, నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అభిమానులు కొనియాడుతున్నారు.
Read Also: Antarvedi: నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య కళ్యాణం
ఇక దేవీ శ్రీ ప్రసాద్ (DSP) మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. ఈ సినిమాలో పాటలకు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (ఆర్ఆర్)కూ బాగా ప్రశంసలు దక్కుతున్నాయి. ‘‘ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు డీఎస్పీనే కష్టపడ్డాడు’’ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి లవ్ స్టోరీలకు దేవీ శ్రీ ప్రసాద్ ప్రాణం పెడతాడు. పాటలు సినిమాకు కీలకంగా మారే ఇలాంటి కథల్లో, డీఎస్పీ తన బెస్ట్ ఇచ్చాడని చెబుతున్నారు. ‘బుజ్జి తల్లి’ పాట తెరపై చూడటానికి రెండు కళ్లు చాలవేమో’ అనేలా అనిపిస్తుందట!
ఇక చందూ మొండేటి కథనం విషయానికి వస్తే.. కథ బాగుందంటూ అభినందనలు వస్తున్నా, కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే మరి నెమ్మదించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే స్టోరీ వేరే డైరెక్టర్ చేతిలో ఉంటే ఇంకాస్త బాగా వచ్చేదనే కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. కానీ కథను సరిగా రాసుకున్నప్పటికీ, ఎక్కడో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
పాజిటివ్ టాక్ హైలెట్స్:
నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ.
దేవీ శ్రీ ప్రసాద్ పాటలు, ఆర్ఆర్.
ఎమోషనల్ కనెక్ట్ సీన్‌లు.
సెకండ్ హాఫ్ ఎంగేజింగ్.
ఫైనల్ వెర్డిక్ట్:
మొత్తం మీద తండేల్ సినిమాకు మంచి టాక్ బాగానే వినిపిస్తోంది. ఎక్కడికక్కడ నెగటివిటీ స్ప్రెడ్ చేయాలనే ప్రయత్నాలు కనిపించినా, ఎక్కువగా పాజిటివ్ కామెంట్లే కనపడుతున్నాయి. ఇంకెందుకు ఆలశ్యం ఈ వీకెండ్ కు కుటుంబంతో సంతోషంగా చూసేయండి. మీరు ఈ సినిమా చూశారా? అయితే మీ అభిప్రాయాలను పంచుకోండి!