NTV Telugu Site icon

Thaman : విమర్శలను తట్టుకుని నాలుగు రోజుల్లోనే స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తమన్

Thaman

Thaman

Thaman : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయనకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన సంగతే. ఇప్పటికే పలు భాషల్లో అనేక ప్రాజెక్టులకు అదిరిపోయే మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులకు మ్యూజిక్ ఇస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వర్క్స్ ను పూర్తి చేసుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ కు ఆయనే సంగీతం అందిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో బాలయ్య అఖండ-2కు బాణీలు అందిస్తున్నారు. ఇంకా తన చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలు ఉన్నాయి. తెలుగుతో పాటు బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Read Also:Yamuna River: కాలుష్య కోరల్లో యమున.. నదిలో విషపూరిత నురుగు

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న బేబీ జాన్.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. 2016లో వచ్చిన హీరో విజయ్‌ ‌‌మూవీ తేరికి రీమేక్ గా తెరకెక్కుతోంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న బేబీ జాన్ టీజర్ ను ఇటీవలె మేకర్స్ విడుదల చేశారు. అయితే టీజర్ వచ్చాక.. తమన్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉందని అంతా మెచ్చుకుంటున్నారు. గతంలో తేరికి జీవీ ప్రకాష్ అందించిన అవుట్ పుట్ కన్నా బేబీ జాన్ కు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మస్తుందని అంటున్నారు. అయితే రీసెంట్ గా సింగం ఎగైన్ మూవీ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అజయ్‌ దేవ్‌ గణ్‌, కరీనా కపూర్‌, రణవీర్ సింగ్, అక్షయ్‌ కుమార్‌ తదితరులు నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ బోల్తా కొట్టింది. డైరెక్టర్ రోహిత్‌ శెట్టి రొటీన్‌ పచ్చడి అంటూ చాలా మంది తిట్టిపోస్తున్నారు.

Read Also:Salman Khan: మళ్లీ సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు.. క్షమాపణ చెబుతారా.. రూ.5 కోట్లు ఇస్తారా..?

అయితే ఆ సినిమాకు తమన్.. రవి బస్రూర్ తో కలిసి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తీవ్ర విమర్శలు వచ్చాయి. టార్చర్ గా అనిపించిందని పలువురు సోషల్ మీడియాలో వాపోయారు. ఇప్పుడు సింగం అగైన్ విడుదలైన అయిన నాలుగు రోజులకే తమన్.. బేబీ జాన్ టీజర్ కు ప్రశంసలు అందుకుంటున్నారు. ఇది ఆయనకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. నాలుగు రోజుల్లోనే సింగం ఎగైన్ విషయంలో వచ్చిన విమర్శలను మర్చిపోయేలా తమన్ చేసుకున్నారన్న మాట. తన అప్ కమింగ్ ప్రాజెక్టులతో ఎలాంటి హిట్లను తన ఖాతాలో వేసుకుంటారో చూడాలి.

Show comments