Thaman : విమర్శలను తట్టుకుని నాలుగు రోజుల్లోనే స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thaman : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయనకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన సంగతే. ఇప్పటికే పలు భాషల్లో అనేక ప్రాజెక్టులకు అదిరిపోయే మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులకు మ్యూజిక్ ఇస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వర్క్స్ ను పూర్తి చేసుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ కు ఆయనే సంగీతం అందిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో బాలయ్య అఖండ-2కు బాణీలు అందిస్తున్నారు. ఇంకా తన చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలు ఉన్నాయి. తెలుగుతో పాటు బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also:Yamuna River: కాలుష్య కోరల్లో యమున.. నదిలో విషపూరిత నురుగు
Also Read
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
- BRS Protest: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
- Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న బేబీ జాన్.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. 2016లో వచ్చిన హీరో విజయ్ మూవీ తేరికి రీమేక్ గా తెరకెక్కుతోంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న బేబీ జాన్ టీజర్ ను ఇటీవలె మేకర్స్ విడుదల చేశారు. అయితే టీజర్ వచ్చాక.. తమన్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉందని అంతా మెచ్చుకుంటున్నారు. గతంలో తేరికి జీవీ ప్రకాష్ అందించిన అవుట్ పుట్ కన్నా బేబీ జాన్ కు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మస్తుందని అంటున్నారు. అయితే రీసెంట్ గా సింగం ఎగైన్ మూవీ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అజయ్ దేవ్ గణ్, కరీనా కపూర్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్ తదితరులు నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ బోల్తా కొట్టింది. డైరెక్టర్ రోహిత్ శెట్టి రొటీన్ పచ్చడి అంటూ చాలా మంది తిట్టిపోస్తున్నారు.
Read Also:Salman Khan: మళ్లీ సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు.. క్షమాపణ చెబుతారా.. రూ.5 కోట్లు ఇస్తారా..?
అయితే ఆ సినిమాకు తమన్.. రవి బస్రూర్ తో కలిసి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తీవ్ర విమర్శలు వచ్చాయి. టార్చర్ గా అనిపించిందని పలువురు సోషల్ మీడియాలో వాపోయారు. ఇప్పుడు సింగం అగైన్ విడుదలైన అయిన నాలుగు రోజులకే తమన్.. బేబీ జాన్ టీజర్ కు ప్రశంసలు అందుకుంటున్నారు. ఇది ఆయనకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. నాలుగు రోజుల్లోనే సింగం ఎగైన్ విషయంలో వచ్చిన విమర్శలను మర్చిపోయేలా తమన్ చేసుకున్నారన్న మాట. తన అప్ కమింగ్ ప్రాజెక్టులతో ఎలాంటి హిట్లను తన ఖాతాలో వేసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
-
PM Modi: పారిస్‌లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
-
The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
-
BRS Protest: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!