S.S.Thaman: త్రివిక్రమ్ నా గురువు.. వచ్చే సినిమాతో ఆస్కారే లక్ష్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S.S.Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ తన కెరీర్లో ఎందరో దర్శకులతో పనిచేశారు. కానీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఆయనకు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో త్రివిక్రమ్‌ను ఒక ‘యోగి’గా అభివర్ణించడమే కాకుండా, తన తదుపరి లక్ష్యాల గురించి తమన్ ధీమా వ్యక్తం చేశారు.
READ ALSO: Telangana Budget: ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. మూసికి రూ.1500 కోట్లు
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఒక ఆధ్యాత్మిక గురువు
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తనకున్న పరిచయం కేవలం దర్శకుడు-సంగీత దర్శకుడి సంబంధం మాత్రమే కాదని తమన్ స్పష్టం చేశారు. “త్రివిక్రమ్ గారు ఒక మేధావి. ఆయన పుస్తకాలు చదువుతారు, చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఆయనతో మాట్లాడటం ఒక మెడిటేషన్ (ధ్యానం) లాంటిది. ఒక వ్యక్తిని సరిగ్గా చదవగలిగే శక్తి ఆయనకు ఉంది. నన్ను ఒక మంచి మనిషిగా మార్చడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది” అని తమన్ కొనియాడారు. తమ మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన సంబంధం కాదని, అది ఒక లోతైన భావోద్వేగమని చెప్పారు. త్రివిక్రమ్ తనను నమ్మిన విధానం వల్లే ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వగలిగానని పేర్కొన్నారు. నా కెరీర్లో 100వ సినిమా అరవింద సమేత అని చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ దగ్గర రామాయణం స్రిప్ట్ ఉంది.. ఇప్పుడు మనం మాయాబజర్ సినిమాను ఎలా అయితే చూస్తున్నామో, మరొక వంద ఏళ్ల వరకు ఈ రామాయాణాన్ని జనాలు అలాగే చూస్తారని అన్నారు.
ఈ పాడ్‌కాస్ట్‌లో ఆస్కార్ అవార్డు ప్రస్తావన రాగా, థమన్ చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ స్థాయికి చేరుకుందని, మన కంటెంట్ చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందని అన్నారు. “నేను చేసే తదుపరి పెద్ద సినిమాలతో ఆస్కార్ స్థాయికి చేరుకోవాలనే పట్టుదలతో ఉన్నాను. మన మట్టి వాసన ఉన్న సంగీతాన్ని గ్లోబల్ ట్రెండ్స్‌కు అనుగుణంగా అందించగలిగితే అది సాధ్యమే. దానికి కావాల్సిన కసి, సాంకేతికత మా దగ్గర ఉన్నాయి” అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండా ఎగురవేస్తాననే సంకేతాలు ఇచ్చారు.
READ ALSO: S.S.Thaman: తమన్ ప్రయాణం.. ‘బాయ్స్’ నుంచి ‘ఓజీ’ వరకు.. మైలురాళ్లు ఇవే!
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!