తలసేమియా వ్యాధిపై అవగాహన పెంచడంతో పాటు వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. రన్‌లో ఒలింపిక్స్ పతక విజేత కరణం మల్లీశ్వరి పాల్గొననున్నారు. రన్ తర్వాత తమన్, సమీరా భరద్వాజ్ నేతృత్వంలో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు.
Also Read: CM Chandrababu: టీడీపీ కార్యకర్త ఆకుల కృష్ణ మృతికి సీఎం సంతాపం!
విశాఖలో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ… ‘ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఎన్టీఆర్ ట్రెస్ట్ ఏర్పాటు అయింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాము. తలసేమియాతో అనేక మంది పిల్లలు బాధపడుతున్నారు. జన్యుపరమైన లోపం వలన తలసేమియా వ్యాధి వస్తుంది. తలసేమియా బాధితుడిపై నెలకు రెండు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. తలసేమియా బాధితుడి కోసం 15 మంది రక్త దాతలు సిద్ధంగా ఉండాలి. మన దేశంలో రెండు లక్షలు మంది తలసేమియా బాధితులు ఉన్నారు. తలసేమియాపై అవహవాన కల్పిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రన్ నిర్వహిస్తున్నాము. తలసేమియాపై ఉద్యమం చేయాలని ఎన్టీఆర్ ట్రెస్ట్ నడుం బిగించింది’ అని అన్నారు.