Site icon NTV Telugu

Varasudu : వారసుడు ఓటీటీ రిలీజ్‌ డేట్‌..?

Varisu

Varisu

దళపతి విజ‌య్ హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. అయితే.. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా కోలీవుడ్‌లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఈగో క్లాష్ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో విజ‌య్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. కానీ.. ఎప్పుడు ఓటీటీ రిలీజ్‌ చేస్తున్నారో అధికారికంగా ప్రకటించలేదు.

Also Read : Lottery: రాత్రికి రాత్రే ‘కోటీశ్వరుడు’.. 88 ఏళ్ల వృద్ధుడికి రూ.5కోట్ల జాక్‌పాట్‌

అయితే.. తాజాగా సమాచారం మేరకు ఫిబ్రవరి 10న ఈసినిమా అమెజాన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారులు ఎవరూ వ్యాఖ్యానించలేదు. మరి ఈ గాసిప్ నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. తెలుగులో వారసుడు పేరుతో విడుదలైన ఈ సినిమాలో శరత్‌కుమార్, జయసుధ, ప్రకాష్ రాజ్, ఖుష్భు, యోగి బాబు, శ్రీకాంత్, షామ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

Also Read : Ashok Gehlot: కరోనా కాంగ్రెస్ పార్టీలోకి కూడా ప్రవేశించింది.. అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version