CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ‘దళపతి’ విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలనను పరుగులు తీయిస్తున్నారు. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని అనూహ్య విజయం దిశగా నడిపించి, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ముస్లిం లీగ్ భాగస్వామ్యంతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్.. బాధ్యతలు చేపట్టిన వెంటనే సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే విజయ్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల నియంత్రించేందుకు కంకణం కట్టుకున్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు వంటి ప్రార్థనా స్థలాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 టాస్మాక్ (Tasmac) మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను వచ్చే రెండు వారాల్లోగా తొలగించాలని అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 4,765 మద్యం దుకాణాలు ఉండగా, తాజా నిర్ణయంతో ప్రార్థనా స్థలాల వద్ద ఉన్న 276, విద్యాసంస్థల దగ్గర ఉన్న 186, బస్టాండ్ల సమీపంలోని 255 దుకాణాలు మూతపడనున్నాయి. మద్యం ప్రాప్తిని తగ్గించి, సామాజిక సంస్కరణలు తీసుకురావాలన్న లక్ష్యంతో విజయ్ ఈ అడుగు వేశారు. అయితే, రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టాస్మాక్ దుకాణాల మూసివేత వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక ప్రభావం, సంక్షేమ పథకాల అమలుపై చర్చలు మొదలయ్యాయి. కేవలం మద్యం దుకాణాలకే పరిమితం కాకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా విజయ్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఆమోదించడంతో పాటు, రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రత్యేక ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ యూనిట్లను నెలకొల్పేందుకు నిధులు మంజూరు చేశారు. తంగా కనిపిస్తున్నాయి.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!