Thalaivar 170 : రజనీ బర్త్డే కానుకగా బిగ్ అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది జైలర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.జైలర్ సినిమా తలైవాకు సూపర్ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది. జైలర్ హిట్ తరువాత తర్వాత ఫుల్ ఫామ్ లో వున్న రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు.ఇప్పటికే తలైవా 170 తో రజినీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.a ఈ సినిమా టైటిల్‌ను రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో రజనీ బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడే పోలీసు అధికారికంగా కనిపించనున్నట్లు సమాచారం.
ఈ మూవీలో గురు ఫేం రితికా సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజువారియర్ మరియు దుషారా విజయన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తలైవా 170 మూవీ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది.జైభీమ్ వంటి సామాజిక సందేశాత్మక మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన జ్ఞానవేళ్ తలైవాను ఏ విధంగా చూపించబోతున్నాడని ప్రేక్షకులు ఎంతో ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ మరోవైపు కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వస్తున్న లాల్‌సలామ్ అనే మూవీ లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ పూర్తయింది 2024 పొంగల్ కానుకగా లాల్ సలామ్ మూవీ విడుదల కానుంది. రజినీకాంత్ దీంతో పాటు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా 171 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్ కనగరాజ్-రజినీకాంత్ కాంబోలో రాబోతున్న ఆ మూవీ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు
Also Read
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!