Site icon NTV Telugu

Thailand: థాయిలాండ్‌లో దారుణం.. చిన్నారులతో సహా 34 మంది మృతి..

Gun Shooting

Gun Shooting

Thailand: థాయ్‌లాండ్‌లో నేడు చోటుచేసుకున్న కాల్పుల ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. దక్షిణ థాయ్‌లాండ్‌ లోని సోంగ్‌క్లా ప్రావిన్స్‌లో ఉన్న ఒక పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటనలో 22 మంది చిన్నారులు సహా మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సంఘటనను దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మాస్ షూటింగ్‌లలో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు.

US Iran Tensions: ఇరాన్‌పై యుద్ధానికి సై అంటున్న అమెరికా.. వణుకుపుట్టిస్తున్న శాటిలైట్ ఫోటోలు!

ప్రావిన్షియల్ పరిపాలన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక తుపాకీ కలిగిన వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం పాఠశాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులను బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటన తెలిసిన వెంటనే సాయుధ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. భయంతో పాఠశాల నుంచి బయటకు పరుగులు తీస్తూ వందలాది మంది విద్యార్థులు రోడ్లపైకి చేరుకున్నారు.

హాట్ యాయ్ జిల్లాకు చెందిన పోలీసులు ప్రస్తుతం తుపాకీదారితో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారి సంఖ్యపై స్పష్టమైన సమాచారం ఇంకా వెలువడలేదు. అయితే ఘటన నుంచి తప్పించుకున్న ఒక భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తుపాకీదారుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. “నాకు కడుపు వద్ద బుల్లెట్ తాకినా నేను బయటపడగలిగాను. పాఠశాల డైరెక్టర్‌పై కాల్పులు జరిగాయి. ఇంకా కొంతమంది పిల్లలు పాఠశాల లోపల బందీలుగా ఉన్నారు” అని అతను తెలిపాడు.

T20 World Cup: ‘‘మా క్రికెటర్ల నిర్ణయం ఇది’’.. టీ20 వరల్డ్ కప్‌పై బంగ్లాదేశ్ యూ-టర్న్..

పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి సుమారు 18 సంవత్సరాల వయస్సు ఉన్న యువకుడిగా అనుమానిస్తున్నారు. ఘటనకు ముందు థుంగ్ లుంగ్ జిల్లాలోని ఒక ఇంటి వద్ద అతడు అసహజంగా ప్రవర్తిస్తూ తన తల్లికి హాని చేస్తానని బెదిరించినట్లు కూడా సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పాఠశాల పరిసరాలను పూర్తిగా ముట్టడి చేసి రక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు.

Exit mobile version