TGSRTC ఉద్యోగులకు షాక్.. ఆ ఇంక్రిమెంట్ నిలిపివేత..!
- TGSRTC ఉద్యోగులకు షాక్ నిర్ణయం
- ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌పై ఇచ్చే ఇంక్రిమెంట్ రద్దు
- స్టెరిలైజేషన్ చేయించుకున్న ఉద్యోగులకు ఇకపై అదనపు జీతం లేదు
- ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు సంబంధించి యాజమాన్యం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఉద్యోగులకు ఇప్పటివరకు అందిస్తున్న ప్రత్యేక ప్రోత్సాహక ఇంక్రిమెంట్‌ను (Incentive Increment) రద్దు చేస్తూ అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయానికి సంబంధించి ఇకపై ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ (స్టెరిలైజేషన్) చేయించుకునే ఉద్యోగులకు లేదా వారి జీవిత భాగస్వాములకు ఇచ్చే అదనపు ఇంక్రిమెంట్ నిలిపివేయబడుతుంది.
Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ రద్దు.. బుకింగ్స్ ఆపేసిన ‘PVR INOX’
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని యాజమాన్యం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ బోర్డు వెల్లడించింది. వాస్తవానికి ప్రభుత్వం 2006లోనే ఈ స్కీమ్‌ను రద్దు చేసినప్పటికీ, ఆర్టీసీలో మాత్రం ఇది కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు దీనికి స్వస్తి పలికారు. గతంలో ఇద్దరు లేదా అంతకంటే తక్కువ పిల్లలు ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే “పర్సనల్ పే” (Personal Pay) రూపంలో ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ లభించేది. తాజా ఉత్తర్వుల ప్రకారం కొత్తగా ఆపరేషన్ చేయించుకునే వారికి ఎలాంటి అదనపు జీతపు పెరుగుదల ఉండదు.

Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!
ఇంక్రిమెంట్ రద్దు చేసినప్పటికీ, ఈ ఆపరేషన్ కోసం ఇచ్చే “స్పెషల్ క్యాజువల్ లీవ్” (Special Casual Leave) మాత్రం యథావిధిగా కొనసాగుతుందని సంస్థ తెలిపింది. TGSRTC బోర్డు సమావేశంలో తీసుకున్న తీర్మానం (No.07/2026) ఆధారంగా ఈ మార్పులు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏకరూపత తీసుకురావడంలో భాగంగా, ప్రభుత్వం ఎప్పుడో రద్దు చేసిన ఈ పాత స్కీమ్‌ను ఇప్పుడు ఆర్టీసీలో కూడా అధికారికంగా తొలగించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!