NTV Telugu Site icon

TGSRTC: హైదరాబాద్ మహా నగరంలో డీలక్స్ బస్సులు.. కండిషన్స్ అప్లై..

Tgsrtc

Tgsrtc

హైదరాబాద్ జంట నగరాలలో సిటీ అతి తొందరలో సిటీ బస్సు ప్రయాణం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇందుకుకు గాను 25 ఎలక్ట్రిక్‌ ఏసీ, 25 నాన్‌ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు నగరానికి చేరుకున్నాయి ఇప్పటికే. అలాగే మరో 450 ఎలక్ట్రిక్‌ బస్సులు జులై మాసం చివరి నాటికి రోడ్డెక్కనున్నాయి. టీజిఎస్ఆర్టీసీ తన మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ సిటీలో ప్ర‌యాణించేందుకు వీలుగా 125 డీలక్స్‌ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటు లోకి తీసుక రానున్నారు. ఈ బస్సులు జులై నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.

Gannavaram Airport: ప్రయాణికుల లగేజీ ఎయిర్ పోర్టులోనే వదిలెళ్లిన విమానం

సిటీలోని అన్ని ప్రధాన రహదారుల్లో డీలక్స్‌ బస్సుల సేవలు నడపనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ‘మహాలక్ష్మి పథకం’ కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. దీనితో ఈ ఉచిత బ‌స్సుల‌లో టెకెట్ హోల్డ‌ర్స్ ప్రయాణం చేసందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ ప్రయాణికులున్న బ‌స్సులు ఎక్క‌లేక అనేక మంది ప్ర‌యాణీకులు వేరే రవాణ స‌దుపాయాల వైపు పరుగులు పెడుతున్నారు.

MS Dhoni: ఎకానమీ క్లాస్‍లో ప్రయాణం చేసిన ధోనీ.. చప్పట్లు, కేరింతలతో మార్మోగిన విమానం..

ఈ నేపథ్యంలో అలాంటి ప్ర‌యాణీకులు సౌకర్యవంతంగా వెళ్లేందుకు వీలుగా ఈ కొత్త డీలక్స్‌ బస్సుల‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇక ఈ బస్సులలో ‘ఉచిత మ‌హాలక్ష్ముల‌ను, పాస్ హోల్డ‌ర్స్’ ను ఈ బ‌స్సుల‌లోకి అనుమ‌తించరు. కేవలం “పేయిడ్ స‌ర్వీస్” పేరుతో ఈ బ‌స్సుల‌ను సిటీలో న‌డ‌ప‌నున్నారు. డీలక్స్‌ బస్సులు కాబట్టి టికెట్ ధరలు కూడా కాస్త ప్రీమియంగా కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రయాణికులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Show comments