Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్ పోలీసులు నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు కాజేస్తున్న ఒక భారీ విదేశీ ఉద్యోగాల ముఠా గుట్టును రట్టు చేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను నిలువునా ముంచుతున్న “ట్రివియల్ చాప్టర్” అనే సంస్థపై ఉక్కుపాదం మోపిన పోలీసులు, ఆ సంస్థకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. విదేశాలకు వెళ్లి లక్షల్లో సంపాదించాలనే కోరికతో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, ముఖ్యంగా గ్రీస్, రొమేనియా, ఇటలీ మరియు సెర్బియా వంటి దేశాల్లో వర్క్ వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను వేదికగా చేసుకుని ఆకర్షణీయమైన ప్రకటనలతో బురిడీ కొట్టించారు.
ఈ కేటుగాళ్లు ఒక్కో అభ్యర్థి నుంచి సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసి, నమ్మకం కలిగించడానికి ఆన్‌లైన్ టెంప్లేట్ల ద్వారా సృష్టించిన నకిలీ ఆఫర్ లెటర్లు , ‘వర్క్ ఆథరైజేషన్’ పత్రాలను అందజేశారు. ఒకసారి డబ్బు చేతికి అందాక బాధితుల ఫోన్ కాల్స్ ఎత్తకుండా, కనీసం సందేశాలకు కూడా సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేసేవారు. విచారణలో ఈ సంస్థకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి అధికారిక రిక్రూట్‌మెంట్ ఏజెంట్ లైసెన్స్ లేదని తేలింది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
𝗝𝘂𝗯𝗶𝗹𝗲𝗲 𝗛𝗶𝗹𝗹𝘀 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗕𝘂𝘀𝘁 𝗢𝘃𝗲𝗿𝘀𝗲𝗮𝘀 𝗝𝗼𝗯 𝗥𝗮𝗰𝗸𝗲𝘁; 𝗧𝘄𝗼 𝗞𝗲𝘆 𝗠𝗲𝗺𝗯𝗲𝗿𝘀 𝗼𝗳 ‘𝗧𝗿𝗶𝘃𝗶𝗮𝗹 𝗖𝗵𝗮𝗽𝘁𝗲𝗿’ 𝗔𝗿𝗿𝗲𝘀𝘁𝗲𝗱
HYDERABAD | April 14, 2026: The Jubilee Hills Police have successfully dismantled a fraudulent gang operating… pic.twitter.com/4f6oqQO8EB
— Hyderabad City Police (@hydcitypolice) April 14, 2026
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న పోలీసులు దాడి చేసి సంస్థ వైస్ ప్రెసిడెంట్ లంక నిరుపమ, రీజినల్ మేనేజర్ మామిడి అరుణ్ రాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సంస్థ సీఈఓ, వ్యవస్థాపకుడు సహా మరో ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలో కేపీహెచ్‌బీ స్టేషన్ పరిధిలోనూ ఈ సంస్థ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు కేవలం అధికారిక ‘ఈ-మైగ్రేట్’ పోర్టల్ ద్వారానే ఏజెంట్ల వివరాలు సరిచూసుకోవాలని, అనధికార సంస్థలకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!