NTV Telugu Site icon

TG Govt: రైతులకు సర్కార్ శుభవార్త.. వారికి రైతు భరోసా నిధులు

Rythu Bharosa

Rythu Bharosa

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం అమలులో భాగంగా.. ఫిబ్రవరి 5న ఒక ఎకరానికి లోపు భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం ప్రభుత్వం మరోసారి రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం ఇప్పటికే ఒక ఎకరం భూమి కలిగిన 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ₹1,126 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే.

Read Also: CM Chandrababu: సైన్స్‌కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు.. వైద్య ఖర్చులు తగ్గాలి..

గత నెల 27న 4,41,911 రైతులకు 9,48,332.35 ఎకరాలకు రూ.5,68,99,97,265 నిధులు జమ చేయగా.. ఈనెల 5వ తేదీన 17,03,419 రైతులకు చెందిన 9,29,234.20 ఎకరాలకు రూ. 5,57,54,07,019 నిధులు విడుదల చేశారు. మొత్తంగా రైతు భరోసా కింద రూ. 2218 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రైతుభరోసా పథకం అమల్లో భాగంగా ఏడాదికి రూ. 12 వేల నగదును ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనున్న సంగతి తెలిసిందే..

Read Also: MLC Kavitha: ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుంది!