NTV Telugu Site icon

Minister TG Bharath: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీజీ భరత్.. స్పెషల్‌ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..

Tg Bharath

Tg Bharath

Minister TG Bharath: సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు టీజీ భరత్.. మొదట సచివాలయంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు అధికారులు.. 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ స్పెషల్‌ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం స్పెషల్ స్టేటస్ కోల్డ్ స్టోరేజ్‌లో ఉందని పేర్కొన్నారు.. అయితే, స్పెషల్‌ స్టేటస్ కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ తరహా గిఫ్ట్ సిటీ ఏపీలో నిర్మాణం చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరనున్నట్టు వెల్లడించారు.. మరోవైపు, నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.. రాష్ట్రంలో పరిశ్రమలు, అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు.

Read Also: Viswambhara: విశ్వంభర సెట్స్ లో మెగాస్టార్ ను కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి

ఇక, గుజరాత్ ను రోల్ మోడల్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు మంత్రి టీజీ భరత్‌.. గతంలో లా మాయా బజార్ సమాచారం ఉండదన్న ఆయన.. రాయితీలు అందక పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అయితే, పరిశ్రమలకు అందాల్సిన రాయితీలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాను అన్నారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమలు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానన్న ఆయన.. ఒక్క ప్రాంతం అభివృద్ధిమాత్రమే కాదు.. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాం అన్నారు. స్నేహ పూర్వక వాతావరణంలో అద్భుతాలు చేయాలన్న ఆలోచనతో ఉన్నామని వెల్లడించారు. మరోవైపు.. మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పక్కకు వెళ్లి పోయాయి.. 2019 నుండి 2024 వరకు పెట్టుబడులు ప్రకటనల వరకే పరిమితం అయ్యాయని దుయ్యబట్టారు.. అలా ఎందుకు జరిగిందో కూడా చూడాలన్నారు మంత్రి టీజీ భరత్‌.