తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 27 నుండి వచ్చే నెల 10 వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. మే 20 నుండి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయి. కొద్దిసేపటి క్రితమే.. టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా నోటిఫికేషన్ రిలీజైంది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
Read Also: Bihar: శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం నితీశ్, రబ్రీ దేవి
ఇదిలా ఉంటే.. తెలంగాణలో మెగా డీఎస్సీ (TS DSC 2024) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. మరోవైపు.. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. కాగా.. తెలంణలో హైదరాబాద్‌లో 878 అత్యధిక ఖాళీలు ఉండగా.. నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అయితే వాటిని భర్తీ చేయనున్నారు.
Read Also: Uttam Kumar Reddy: ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 3500 ఇళ్ల నిర్మాణం చేస్తాం..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. టెట్ నిర్వహణకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. డీఎస్సీ కంటే ముందే నిర్వహించుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. దీంతో 3 లక్షల మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులపక్షాన ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. ప్రజల, నిరుద్యోగుల ఆలోచనలను కాంగ్రెస్ ప్రభుత్వం వింటుంది అని మరోసారి రుజువైంది.. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలియజేశారు.