Tesla Cars Discounts: భారత మార్కెట్లో అడుగు పెట్టిన టెస్లా ఇన్‌క్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. గత ఏడాది భారత్‌కు దిగుమతి చేసిన తొలి వాహనాల్లో దాదాపు మూడో వంతు కార్లు ఇప్పటికీ అమ్ముడుపోకుండా మిగిలిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రారంభంలో బుకింగ్‌లు చేసిన కొందరు కొనుగోలుదారులు తరువాత వెనక్కి తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది.
Read Also: Jigris Movie OTT: పండగ వేళ థియేటర్ల వద్ద సినిమాల రచ్చ.. ఓటీటీలో ‘జిగ్రిస్’ ఊచకోత!
ఇక, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా సంస్థ సుమారు నాలుగు నెలల క్రితం భారత్‌కు 300 మోడల్ వై (Model Y) ఎస్యూవీ వాహనాలను తెచ్చింది. అయితే, వీటిలో దాదాపు 100 వాహనాలకు ఇప్పటికీ అమ్ముడుపోలేదు. దీంతో మిగిలిన స్టాక్‌ను తగ్గించేందుకు, కొన్ని వేరియంట్లపై రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. కాగా, భారత్‌లో జూలైలో టెస్లా కార్లు అధికారికంగా ప్రవేశించాయి. దిగుమతి కార్లపై 110 శాతం వరకు పన్నులు ఉన్నప్పటికీ, బ్రాండ్ విలువతోనే విక్రయాలు పెరుగుతాయని కంపెనీ ఆశించింది. కానీ, ఇది అంత తేలికగా సాధ్యపడడం లేదని తాజా పరిస్థితులు సూచిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లు, నిల్వలపై టెస్లా మాత్రం ఇంకా స్పందించలేదు.
Read Also: Nari Nari Naduma Murari: సంక్రాంతి 2026కి బ్లాక్‌బస్టర్ ఎండ్.. శర్వానంద్ కెరీర్లో మరో మైలురాయి!
అయితే, ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు డిమాండ్ మందగిస్తోంది. 2025లో వరుసగా రెండో ఏడాదీ కంపెనీ గ్లోబల్ అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకందారుగా చైనా సంస్థ బీవైడీ (BYD) నిలిచింది. అమెరికా, యూరప్, చైనా లాంటి కీలక మార్కెట్లలో పెరుగుతున్న పోటీ, కొన్ని దేశాల్లో సబ్సిడీలు తగ్గడం టెస్లా మార్కెట్ వాటాను ప్రభావితం చేస్తున్నాయి. భారత్‌లోనూ అధిక ధరలు, బ్రాండ్‌పై పరిమిత అవగాహన కారణంగా కొనుగోలుదారులు పూర్తిగా ఆకర్షితులు కావడం లేదని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా, ఈ పరిస్థితుల్లో భారత మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు టెస్లా కీలక చర్యలు తీసుకుంటోంది. గత నవంబర్‌లో లాంబోర్గినీ ఇండియా మాజీ హెడ్ శరద్ అగర్వాల్‌ను భారత్ కార్యకలాపాల అధిపతిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లగ్జరీ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు సమాచారం.