NTV Telugu Site icon

Terrorist Attack: సోమాలియాలో హోటల్​పై ఉగ్రవాదుల దాడి.. 9 మంది మృతి.. 47 మందికి గాయాలు

Somaliya

Somaliya

Terrorist Attack: సోమాలియాలో మిలిటెంట్లు మరోమారు రెచ్చిపోయారు. ఓ హోటల్​పై పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. 47 మంది గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది.

Read Also: Minister KTR : చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరో అందరికీ తెలుసు

సోమాలియా తీరప్రాంతమైన కిస్మయోలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. తొలుత పేలుడు పదార్థాలు అమర్చిన కారుతో హోటల్ గేటును ఢీకొట్టారు. ఆ తర్వాత ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం మరికొందరు సాయుధులు హోటల్ లోకి ప్రవేశించారు. ఈ దాడిలో 9మంది చనిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. చనిపోయిన వారిలో నలుగురు భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఘటనలో 47మందికి పైగా గాయాలపాలయ్యారని తెలుస్తోంది.

Read Also:Boy Fell From Building : భవనం మూడవ అంతస్తుపై నుండి కింద పడ్డ 17 నెలల బాలుడు

ఇది ఇలా ఉంటే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. రాజధాని మొగదిషుకు 500కిలో మీటర్ల దూరంలో కిస్మయో నగరంలో ఉన్న ఈ హోటల్లో ఎక్కువగా ప్రభుత్వ అధికారులు సమావేశం అవుతుంటారు. ఆల్ ఖైదా సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ సోమాలియాలో తప్పకుండా విధ్వంసానికి పాల్పడుతోంది.

Show comments