Terrorist Attack : పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు ఇప్పుడు నేరుగా పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై, పోలియో టీకాలు వేసే భద్రతా కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. మరో ఘటనలో కూడా పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ రెండు ఘటనల్లో ఇద్దరు పోలీసులతో సహా ముగ్గురు మృతి చెందగా, స్టేషన్ హెడ్ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో కొందరు ఉగ్రవాదులు కూడా గాయపడినట్లు సమాచారం.
Read Also: Teacher Love Letter: సెలవుల్లో బాగా మిస్ అవుతా.. నీతో మాట్లాడాలని ఉంది.. ఉదయమే రా
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లక్కీ మార్వాట్ జిల్లాలోని వార్గాడ పోలీస్ స్టేషన్‌పై మిలిటెంట్లు శుక్రవారం ఉదయం కాల్పులు జరిపారు. దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఇరువర్గాల నుంచి భారీ కాల్పులు జరగ్గా, ఒక పోలీసు మరణించాడు. వార్గడ స్టేషన్ ఇన్‌చార్జికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మరికొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. లక్కీ మార్వాట్ జిల్లాలోని పహర్‌ఖేల్ ప్రాంతంలో పెట్రోలింగ్‌లో ఉన్న ఒక పోలీసు మోటార్‌సైకిల్‌పై మెరుపుదాడికి పాల్పడ్డారు. ఇందులో పోలీసు యూనస్ ఖాన్, అతని సహచరుడు ఇస్మతుల్లా మృతి చెందారు. ఇద్దరినీ హత్య చేసిన అనంతరం దుండగులు పారిపోయారు.
Read Also: Boy Kidnap: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కిడ్నాప్‌తో లైఫ్ సెట్ అయినట్టే అనుకున్నారు.. కానీ
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో, పోలియో టీకాలు వేసే సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. జిల్లాలోని టీకా కేంద్రానికి పోలీసు భద్రతా దళం వెళుతుండగా, అర డజనుకు పైగా తుపాకులతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ఒక వంతెన దగ్గర దాక్కుని.. భద్రతా బృందం వంతెన వద్దకు చేరుకున్న వెంటనే, వారు హ్యాండ్ గ్రెనేడ్లతో దాడి చేశారు. ఆపై భారీ కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఒక ఉగ్రవాది గాయపడ్డాడు. సహ ఉగ్రవాదితో కలిసి దుండగులు పారిపోయారు.