NTV Telugu Site icon

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్కు ఉగ్రదాడి భయం..?

Terror Threat

Terror Threat

Terror Threat to T20 World Cup: మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. టోర్నమెంట్ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్‌కు ఉత్తర పాకిస్తాన్‌ ప్రాంతం నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. పొట్టి ప్రపంచకప్‌ సహా పలు ఇతర క్రీడా కార్యక్రమాలపై దాడులకు పాల్పడాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బ్రాంచ్ (IS-Khorasan) పిలునిచ్చినట్లు సమాచారం. ప్రో ఇస్లామిక్ స్టేట్ (IS) మీడియా వర్గాలు హింసను ప్రేరేపించే విధంగా ప్రచారాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తమ మద్దతుదారులంతా యుద్ధ రంగంలోకి దిగాలని పిలుపునిస్తున్నాయి.

Read Also: Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన 181యూనివర్శిటీల వైస్ ఛాన్స్‎లర్లు

కాగా, ఈ అంశంపై క్రికెట్ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు స్పందించింది. తమ దేశంలో జరిగే ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం జరగదని హామీ ఇచ్చింది. ఈ మెగా ఈవెంట్ కి సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తామన్నారు. క్రికెట్‌ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ టోర్నీ సజావుగా సాగుతుందని క్రికెట్ వెస్టిండీస్ సీఈఓ జానీ గ్రేవ్స్ వెల్లడించారు. టీ20 ప్రపంచకప్‌ 2024కు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యమిస్తుంది.

Read Also: Andhra Pradesh: ఏపీలో నడి రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు.. వీడియో వైరల్‌

అయితే, జూన్‌ 1 నుంచి ఈ క్రికెట్‌ మహా సంగ్రామం స్టార్ట్ కానుంది. తొలి మ్యాచ్‌ యూఎస్‌ఏలోని డల్లాస్‌ నగరంలో కొత్తగా నిర్మించిన స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ జట్టు.. కెనడాతో తలడనుంది. మెగా టోర్నీలో భారత్‌ జూన్‌ 5వ తేదీన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో ఆడబోతుంది. ఈ ప్రపంచకప్‌లో ఇండియా- పాకిస్థాన్ మధ్య జూన్‌ 9న మ్యాచ్ జరుగునుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్‌ క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది.