మొన్న విజయనగరం.. ఇప్పుడు రాయచోటి.. ఉగ్రమూకల కదలికలతో ఈ రెండు ప్రాంతాల్లో కలకలం రేగింది. తాజాగా ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరినీ చెన్నైకి తరలించి విచారిస్తున్నారు. మరోవైపు రాయచోటి పోలీసులు ఆ ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
READ MORE: Off The Record: వనపర్తి డీసీసీ పీఠం కోసం ఆరుగురు పోటీదారులు
తమిళనాడులో జరిగిన వరస బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ మన్సూర్ ఆలీని 3 రోజుల కిందట ఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని విచారణ నిమిత్తం చెన్నైకి తీసుకెళ్లారు..అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదులు ఇన్నేళ్ల నుంచి ఉంటున్నారన్న విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. తమ వద్దనే ఉంటున్న వారు బాంబుపేలుళ్లకు పాల్పడిన వారా? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వీళ్లిద్దరూ తమిళనాడు, కేరళలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని చెబుతున్నారు..
READ MORE: Eng vs IND: డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. భారీ స్కోర్ సాధించిన భారత్..!
ఐబీ అధికారులు.. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తర్వాత రాయచోటి పోలీసులు.. ముష్కరుల కదలికలపై దర్యాప్తు చేస్తున్నారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించడమే కాకుండా పెద్దయెత్తున పేలుడు పదార్థాలు, బకెట్ బాంబులు, సూట్ కేసు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ 20 ఏళ్లుగా ఉంటున్నా ఎవరికీ అనుమానం రాకుండా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. అబూబాకర్ సిద్ధిఖీ భార్య షేక్ సైరాబాను, షేక్ మన్సూర్ ఆలీ భార్య షమీం పైన కూడా పేలుడు పదార్థాల చట్టం, ఉపా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు..
READ MORE: Eng vs IND: డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. భారీ స్కోర్ సాధించిన భారత్..!
ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదుల భార్యలను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పర్చగా వారికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వారిద్దరినీ కడప జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు ఇన్నాళ్లూ జనబాహుళ్యంలో ఉన్న ముష్కరులపై నిఘా పెట్టారు పోలీసులు. ఉగ్రవాదులు ఎవరెవరితో సఖ్యతగా ఉన్నారు? ఈ 20 ఏళ్ల నుంచి ఆ కుటుంబాలతో ఎవరికి పరిచయం ఉంది? వారు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు? వారికి ఆశ్రయం కల్పించిన వారు ఎవరు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Off The Record: దూకుడు పెంచిన జగన్.. వ్యూహం అదేనా..?
మరోవైపు వారి ఇళ్లలో పేలుడు పదార్థాలు దొరకడంతో ఎక్కడెక్కడ పేలుళ్లు జరపడానికి ప్లాన్ చేశారన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. వారికి అత్యంత సన్నిహితులుగా వ్యవహరించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మొన్నవిజయనగరంలో ఉగ్రకుట్రను భగ్నం చేసి నెల గడవకముందే తిరిగి రాయచోటిలో ఉగ్ర కదలికలు కనిపించడంతో ఆ ప్రాంతంలోకి ఎవరెవరు కొత్తగా వచ్చి నివాసం ఉంటున్నారన్న కోణంలో కూడా విచారణ దర్యాప్తు చేస్తున్నారు.
చిరు వ్యాపారులు జీవనం సాగిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా పేర్లు మార్చుకుని ఇక్కడ మకాం వేశారని డీఐజీ ప్రవీణ్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు గత మూడు దశాబ్దాలుగా రాయచోటిలో రహస్య జీవితం గడుపుతూ సాధారణ వ్యాపారులుగా జీవిస్తున్నారు. అబూబకర్ సిద్దీకి ,మొహమ్మద్ అలీ ఇద్దరు సోదరులు. వీరు కేరళలోని మేళపలయం నివాసులు. వారు 1995 నుంచి అనేక ఉగ్రవాద కేసుల్లో నిందితులుగా ఉన్నారు . గత 30 సంవత్సరాలుగా రాయచోటిలో రహస్యంగా జీవిస్తున్నారు..
రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో నివసిస్తూ చీరల వ్యాపారంతో పాటు చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నారు. అబూబకర్‌ను స్థానికులు “కేరళ కుట్టి”గా పిలిచేవారు. వీరిపై 1995 పార్సిల్ బాంబు కేసు, 1999లో తమిళనాడు, కేరళలో జరిగిన సీరియల్ బాంబు దాడులు, 2011 మధురైలో బీజేపీ నాయకుడు ఎల్.కె. అద్వానీ రథయాత్రపై బాంబు దాడి ప్రణాళిక, 2013 మల్లేశ్వరం బీజేపీ కార్యాలయ బాంబు దాడి, 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య కేసులు ఉన్నాయి…
READ MORE: Industrial Tragedy: సిగాచి ఫ్యాక్టరీలో బ్లాస్ట్.. ఈరోజు 13 మృతదేహాలు బంధువులకు అప్పగింత
అబూబకర్ , మొహమ్మద్ అలీ మదనపల్లె డివిజన్‌కు చెందిన స్థానిక మహిళలను వివాహం చేసుకున్నాడు. వారు రాయచోటిలో అద్దె ఇళ్లలో నివసించేవారు. తమ గురించి ఎక్కువగా బయటకు తెలియకుండా జాగ్రత్తపడేవారు. పోలీసులు వారి భార్యలను అరెస్టు చేశారు. వారి ఇళ్లల్లో జరిగిన సోదాల్లో భారీగా పేలుడు పదార్థాలు తయారు చేసే వస్తువులు పట్టుబడ్డాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, డాక్యుమెంట్లు కూడా దొరికాయి. రాయచోటి నుంచి వారు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలకు ఈ బాంబులు దొరకడం సాక్ష్యంగా మారాయి. అదే సమయంలో స్థానిక యువతకు రహస్యంగా శిక్షణ ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు…
