Site icon NTV Telugu

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. భద్రతా సిబ్బంది అప్రమత్తం..

Amarnath Yatra

Amarnath Yatra

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అయిన అమర్‌నాథ్ యాత్రను ప్రతి హిందువు తమజీవితంలో ఒక్కసారైనా చేయాలనీ కోరుకుంటాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కానుంది. అయితే ఈ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని పాకిస్థాన్ కేంద్రంగా విధ్వంసాలు సృష్టించే ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లుగా భారత భద్రతా దళాలకు సమాచారం వచ్చింది.

Read Also: Meenakshi Chaudhary: ఏంటి పాప జాలి చూపిస్తున్నావా?

ఉగ్రవాదుల ముప్పు ఉందని సమాచారం రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అమర్నాథ్ యాత్ర కాన్వాయ్, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగవచ్చునని నిఘా వర్గాల నుంచి పక్క సమాచారం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం కశ్మీరీ యువకులకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. అమర్‌నాథ్ యాత్రపై దాడి చేసే బాధ్యతను లోకల్ వ్యక్తులకు అప్పగించినట్లు సమచారం వచ్చింది.

Read Also: Jogi Ramesh : వరుణ దేవుడి ఆశీస్సులతో ప్రాజెక్టులన్నీ జల కళతో నిండిపోయాయి

కశ్మీర్ యువకులు స్థానికులు కావడంతో వీరికి చొరబాటు మార్గాలన్నీ తెలిసి ఉంటాయని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థకు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. రాజౌరీ–ఫూంచ్, పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీతో పాటు మరిన్నీ ప్రాంతాల్లో ఉగ్రదాడికి జరిగే అవకాశముందని భద్రతా సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. దాడులకు పాల్పడుతారని భావిస్తున్న ఇద్దరు యువకుల గురించి భద్రతా సంస్థలు గాలిస్తున్నాయి. వారి ఇళ్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. అమర్నాథ్ యాత్రకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అమర్‌నాథ్ యాత్రకు ముందే జమ్మూ కశ్మీర్ ను భద్రతా దళాలు తమ పర్యవేక్షణలోకి తీసుకున్నాయి. స్క్వాడ్ టీమ్‌లు, క్యూఆర్‌టి, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఎస్‌ఎస్‌బీ, భద్రతా ఏజెన్సీలు యాత్రికుల భద్రతను పటిష్టం చేశాయి.

Exit mobile version