Uttar Pradesh : టెన్త్ విద్యార్థినిపై స్కూల్ సిబ్బంది గ్యాంగ్ రేప్.. ఆపై హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అయోధ్యలో టెన్త్ విద్యార్థినిపై పాఠశాల సిబ్బంది అయిన స్కూల్ మేనేజర్, స్పోర్ట్స్ టీచర్ ఇద్దరు దారుణానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ చేసి పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి కిందకు తోసివేశారు. తీవ్రగాయాలతో ఆ బాలిక స్పాట్లోనే చనిపోయింది. ఈ మేరకు పోలీసులు సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం భారీ పోలీసు బలగాల సమక్షంలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయిన కూతురికి ఆమె తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. అయోధ్యలో సీబీఎస్‌ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో శుక్రవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఊయల నుంచి పడి టెన్త్ విద్యార్థిని మృతి చెందిందని స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. అయితే సీసీటీవీ ఫుటేజీలో పాఠశాల భవనంపై అంతస్తు నుంచి బాలిక పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
Read Also:New Parliament Inauguration: మహత్తర ఘట్టం.. నేడు కొత్త పార్లమెంట్ ప్రారంభం
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
చనిపోయిన బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సమ్మర్ హాలీడేస్ కోసం పాఠశాల మూసివేయబడిన తర్వాత కూడా ప్రధానోపాధ్యాయుడు రష్మీ భాటియా తన కుతూరుని పాఠశాలకు పిలిచారని, ఉదయం 9.50 గంటలకు ప్రిన్సిపాల్ తనకు ఫోన్ చేశారనీ, తన కుతూరు ఊయల నుండి పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. తాను పాఠశాలకు చేరుకున్నప్పుడు.. తన బిడ్డను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారనీ, ఆమె శరీరంపై గాయాలు, ఇతర గుర్తులు ఉన్నాయని, ఉయల నుంచి పడిపోయడం వల్ల ఇలాంటి ఘోరం జరగదని, కావాలనే తన బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. అయితే.. పోలీసుల కథనం ప్రకారం.. పదో తరగతి విద్యార్థిని పాఠశాల చేరుకున్న తరువాత పాఠశాల మేనేజర్ బ్రిజేష్ యాదవ్, స్పోర్ట్స్ టీచర్ అభిషేక్ కన్నౌజియా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనీ, ఈ విషయం వెలుగులోకి రాకుండా.. ఆ చిన్నారిని పాఠశాల పై అంతస్తు నుంచి తోసేశారు. ఈ ఘటనలో స్కూల్ మేనేజర్ బ్రిజేష్ యాదవ్, ప్రధానోపాధ్యాయుడు రష్మీ భాటియా, స్పోర్ట్స్ టీచర్ అభిషేక్ కన్నౌజియాపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో పాస్కో కింద కూడా కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి స్కూల్ యాజమాన్యం కుటుంబ సభ్యులను, పోలీసులను వేర్వేరుగా, తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చి మోసం చేసిందని, రక్తపు ఆనవాళ్లు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేశారనీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దానికి సంబంధించిన ఇతర ఆధారాలను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
Read Also:Pocharam Srinivas Reddy : ఆనాడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించారు
అయోధ్య పోలీసు సూపరింటెండెంట్ మధుబన్ సింగ్ మాట్లాడుతూ.. “అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం మధ్యాహ్నం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ మేనేజర్, స్పోర్ట్స్ టీచర్‌పై మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయబడింది. ఈ విషయమై విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక అత్యాచారాన్ని నిర్ధారించిందా అన్న ప్రశ్నకు.. మధుబన్ సింగ్ మాట్లాడుతూ.. “మాకు చేరిన పోస్ట్‌మార్టం నివేదిక కాపీ చదవడం లేదు . మేము నివేదికను చదవడానికి ప్రయత్నిస్తున్నాము. అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక ఇంకా అందలేదని తెలిపారు. మరోవైపునిందితులను అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కోరుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!