Site icon NTV Telugu

Crime: దారుణం.. పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం.. ఆపై హత్య

Girl

Girl

Andhrapradesh: దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవలోకే వస్తుంది.

Also Read: Climate Change: మానవ మనుగడకే సవాల్‌ … ఉపఖండంలో వేగంగా వాతావరణ మార్పులు

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని సోమపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆ గ్రామంలో 10వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా బాలికను దారుణంగా హత్య చేశాడు. నిందితుడిని అదే మండలానికి చెందిన కళ్యాణ్‌గా గుర్తించారు. పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను దారుణంగా హతమార్చిన నిందితుడిని ఉరితీయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తు్న్నారు.

Exit mobile version