Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన త్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పది భాషల్లో రూపొందిన ఈ సినిమాలో దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 10న కంగువా సినిమా విడుదల అయింది. కంగువా సినిమాలో సూర్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించారు. పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో ఇప్పటివరకు తెరపైకి రాని ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. పలు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటులు బాబీ డియోల్, దిశా పటానీ తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో జగపతి బాబు, యోగి బాబు, సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Read Also:Mokshagna Teja : నందమూరి మోక్షజ్ఞ రెండవ సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?
భారీ హైప్‌తో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సూర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇపుడు థియేటర్స్ లో దాదాపు కనుమరుగు కూడా అయిపోయింది. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి రావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈ డిసెంబర్ 12 లేదా 13 నుంచే వచ్చేస్తుందని తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
Read Also:Maoist: నేటి నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు.. పోలీసుల అలర్ట్