NTV Telugu Site icon

Kaushik Reddy: గ్రామసభలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేపై టమాటాలతో దాడి

Kaushik Reddy

Kaushik Reddy

Kaushik Reddy: నేడు జరుగుతున్న కమలాపూర్ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సభ కాంగ్రెస్ నాయకులు, BRS నాయకుల మధ్య ఘర్షణకు దారితీసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లిస్ట్‌పై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమయంలో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. “మీ హయాంలో ఏమి చేయలేదని, మా ప్రభుత్వం అన్ని చేస్తోంది” అని కాంగ్రెస్ నాయకులు అనడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుల దాడికి ప్రతిగా బిఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు విసరడం ప్రారంభించారు. ఇరువర్గాలు ఒకదానికొకటి నినాదాలు చేస్తూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈ ఘర్షణతో గ్రామసభ పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది.

Also Read: MLA House Arrest: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్టు

ఇక విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఘటన స్థలానికి భారీగా పోలీసులు మోహరించారు. ఇరువర్గాలను శాంతింపజేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. గ్రామసభలు ప్రజాసమస్యలను చర్చించడానికి ఉండాల్సి ఉంటే, ఇలాంటి రాజకీయ ఘర్షణలతో అభివృద్ధి అడ్డంకులు ఎదుర్కొంటోంది. స్థానికులు గ్రామసభలో జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్వేగభరిత ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.