NTV Telugu Site icon

Gudivada tension: ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు..గుడివాడలో టెన్షన్

Gudivada

Gudivada

కృష్ణా జిల్లాలో ఎప్పుడూ హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తుంటాయి. తాజాగా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలోనే బొమ్ములూరు వుంది. బొమ్ములూరుకు చేరుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు దీనిపై సమీక్షిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు టీడీపీ నేతలు.

ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న వైసీపీ రంగులు చెరిపేసి పసుపు రంగులు వేశారు టీడీపీ నేతలు. టీడీపీ నేతలు వెళ్లిన తర్వాత, బొమ్మలూరు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు వైసీపీ నేతలు. దీంతో బొమ్ములూరు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడన్నారు. మహానాడు బ్యానర్లపై, అధికార పార్టీ నేతల బ్యానర్లు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.

29న గుడివాడలో జరిగే మహానాడు కొడాలి నాని పతనానికి నాంది కానుందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్ధే రకం కొడాలి నాని. వాపు చూసి బలుపు అనుకుంటున్న కొడాలి నానికి గుణపాఠం తప్పదు. కార్యకర్తల తెగువ, కసితో కొడాలి నాని లాంటి నాయకుల కొట్టుకుపోక తప్పదు. గుడివాడ మహానాడును రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరిగే మహానాడును విజయవంతం చేసేందుకు మా శ్రేణులు కసిగా ఉన్నాయన్నారు నక్కా ఆనందబాబు,

Bonda Uma: మద్యం బ్రాండ్లు టెస్ట్ చేయించే దమ్ముందా?